Begin typing your search above and press return to search.
కొవాగ్జిన్ తీసుకున్నారా .. అయితే అమెరికా ఫ్లైట్ ఎక్కేయచ్చు !
By: Tupaki Desk | 15 Jun 2021 2:30 PM GMTఅగ్రరాజ్యం అమెరికా వెళ్ళే భారతీయ విద్యార్ధులకు శుభవార్త చెప్పింది అమెరికా ప్రభుత్వం. ఇప్పటి వరకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులను అనుమతించని అమెరికా ప్రభుత్వం ఇప్పుడు దాని నుండి సడలింపులు ఇచ్చింది. కోవాగ్జిన్ టీకా తీసుకున్న విద్యార్థులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటి దాకా ఉన్న టెన్షన్ కొంచెం క్లియర్ అయినట్టే అని చెప్పచ్చు. దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ది చేసిన సంగతి తెలిసిదే. అయితే తాజాగా కోవాగ్జిన్ తీసుకున్న భారతీయ విద్యార్థులకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవాగ్జిన్ వేసుకున్న భారతీయ విద్యార్ధులపై ఆంక్షలను ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది.
ఈ నిర్ణయంతో భారతీయ విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా డబ్ల్యూహెచ్ ఓ అనుమతి లేకపోవడంతో పలు దేశాలు కొవాగ్జిన్ పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్నారు. అయితే డబ్ల్యూహెచ్ ఓ గుర్తింపు లేని వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసున్నా కూడా కొన్ని దేశాలలో అన్ వాక్సినేటెడ్ గానే పరిగణిస్తున్నారు. నిజానికి కోవాగ్జిన్ అమెరికాలో అత్యవసర అనుమతి కోసం కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు ప్రయత్నించినా అనుమతి అయితే లభించలేదు. మరి ఆ అనుమతి ఎప్పుడు లభిస్తుందో చూడాలి మరి.