Begin typing your search above and press return to search.
అమెరికా వెళ్లే విద్యార్థులకు శుభవార్త
By: Tupaki Desk | 19 April 2022 7:30 AM GMTఅమెరికాలో చదువుకోవాలన్నది ప్రతి భారతీయ విద్యార్థి కల. అగ్రరాజ్యంలో విలాసవంతమైన జీవితాల కోసం ఎంతో కష్టపడుతుంటారు. భారత్ లో ఆస్తులు అమ్మి మరీ తల్లిదండ్రులు తమ బిడ్డలను అమెరికా పంపిస్తుంటారు. అంతలా అమెరికా అంటే క్రేజ్ ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా గతంలో ట్రంప్ అయ్యాక విదేశీయులకు ద్వారాలు మూసి ఎంట్రీని క్లిష్టతరం చేశాడు.
ట్రంప్ దిగిపోయాక అధ్యక్షుడైన జోబిడెన్ ఇప్పుడు విదేశీ నిపుణులకు రెడ్ కార్పేట్ పలుకుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో చదువకునేందుకు వెళ్లే విద్యార్థులకు శుభవార్తను చెప్పారు.
విద్యార్థి వీసాల స్లాట్ల సంఖ్యను ఆ దేశం భారీగా పెంచింది. వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గించారు.
పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు మాత్రం వేచి ఉండాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల వరకూ వీసా స్లాట్ల కోసం సుమారు 3 ఏళ్ల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వారి సమస్యలను అమెరికా కాన్సులేట్ అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్ లోని కాన్సులేట్ పరిధి నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎదురుచూపులకు ఆదేశం తెరదించింది. సోమవారం నుంచి భారీగా విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేసింది.
ఫలితంగా స్లాట్ల కోసం వేచి ఉండే సమయం 911 రోజుల నుంచి ఒక్కసారిగా 68 రోజులకు తగ్గింది. హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలో వీసా కోసం వేచి ఉండే సమయం సోమవారానికి కూడా 899 రోజులుగానే ఉంది.