Begin typing your search above and press return to search.
ఇకపై స్కూల్స్ 100 రోజులేనట !
By: Tupaki Desk | 30 May 2020 6:15 AM GMTదేశంలో మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంలేదు. ఇప్పటివరకు లక్షా 70 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ నిర్వహణకు సరికొత్త వ్యూహ రచనలు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి బడికి పిల్లలు 100 రోజులు మాత్రమే వెళ్లే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది.
గతంలో మాదిరిగా స్కూల్స్ కు 220 పనిదినాలు అంటే 1,320 గంటల తరగతి బోధన ఇక మీదట ఉండకపోవచ్చనే భావన విద్యావేత్తల్లో వినపడుతోంది. అయితే 220 రోజుల్లో బడికి పిల్లలు 100 రోజులు మాత్రమే వెళ్లే విధంగా మరో 100 రోజులు ఇంటి వద్దే ఆన్‌లైన్ ద్వారా చదువుకునే విధంగా షెడ్యూల్ ను రూపొందిస్తున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. మిగితా 20 రోజులను విద్యార్థులకు బడుల్లో లేదంటే ఇళ్లలో కౌన్సెలింగ్ ఇవ్వడానికి కేటాయిస్తున్నామని తెలిపాయి.
ఈ వివరాలతో పాఠశాలల పునఃప్రారంభం’ పేరిట త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయబోతున్నామని చెప్పాయి. అలాగే, ప్రస్తుతం 45 నిమిషాల పాటు బోధించే ఒక పీరియడ్‌ను 30 నిమిషాలకు కుదించాలని భావిస్తోంది. పరీక్షల విధానాన్నీ సవరించాలని ఆలోచిస్తోంది. ఒత్తిడి లేని అసె్‌సమెంట్ లేదా పరీక్షలకు మొగ్గుచూపుతోంది. 5వ తరగతి లోపు విద్యార్థులకు స్కూలు బ్యాగు తప్పనిసరి కాదని నిర్ణయించే అవకాశం ఉంది
ప్రస్తుతం ఆన్ లైన్ సౌకర్యాలు లేని విద్యార్థులపై స్కూల్ యాజమాన్యాలు దృష్టి పెట్టాలని హెచ్ ఆర్ డీ మంత్రిత్వ శాఖ సూచించింది. భవిష్యత్తులో కూడా ఆన్ లైన్ విధానం తప్పదు కాబట్టి ఆన్ లైన్ సౌకర్యాల కల్పన దిశగా ప్రయత్నం చేయాలని తెలిపింది.విద్యార్థులను రవాణా చేసే వాహనాలను రెండు రోజులకు ఒకసారి శానిటైజ్ చేయడం, ఒకే సీటులో ఒకే విద్యార్థి కూర్చొవడం వంటివి అవంభించాలని పేర్కొననుంది. పాఠశాలలు థర్మామీటర్లు, సబ్బులు, మాస్కులు అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మధ్యాహ్న భోజనానికి సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.