Begin typing your search above and press return to search.
తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇదీ..
By: Tupaki Desk | 9 May 2020 5:30 AM GMTతెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇదీ.. వారి కరోనా-లాక్ డౌన్ కష్టాలు దాదాపు తీరినట్టే.. తెలంగాణలోని దాదాపు 80శాతం జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వెళ్తాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 9 మాత్రమే గ్రీన్ జోన్ లో ఉన్నాయి. ఇప్పుడు కొద్దిరోజులుగా కొత్త కేసులు లేకపోవడంతో ఆరెంజ్ జోన్ లో ఉన్న 14 జిల్లాలు త్వరలోనే గ్రీన్ జోన్ లో చేరబోతున్నాయి.
సోమవారం నుంచి కరీంనగర్ - రాజన్న సిరిసిల్ల - మంచిర్యాల - నారాయణ పేట - వికారాబాద్ - నల్గొండ - జగిత్యాల - ఆసిఫాబాద్ - జనగామ - జయశంకర్ - కామారెడ్డి - మెదక్ - సంగారెడ్డి - మహబూబ్ నగర్ జిల్లాలు గ్రీన్ జోన్ లోకి మారుతాయని ఈటల రాజేందర్ తెలిపారు.
వీటిని తీసేస్తే ఇక 6 జిల్లాలు మాత్రమే కరోనా ప్రభావిత రెడ్ జోన్ లో ఉంటాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్ - మేడ్చల్ - రంగారెడ్డి - సూర్యపేట - వరంగల్ అర్బన్ - నిజామాబాద్ రెడ్ జోన్ లో ఉండనున్నాయి. వీటిల్లో నిజామాబాద్ - వరంగల్ అర్బన్ - సూర్యాపేటలో 14 రోజుల్లో ఒక్క కేసులు నమోదు కాలేదని.. ఇవి మూడు జిల్లాలు ఆరెంజ్ జోన్లోకి మారుతాయని ఈటల తెలిపారు.
దీంతో ఇప్పుడు తెలంగాణలో మిగిలే రెడ్ జోన్ జిల్లాలు కేవలం హైదరాబాద్ - రంగారెడ్డి - మేడ్చల్ మాత్రమే డేంజర్ జోన్ లో ఉంటాయని ఈటల తెలిపారు. హైదరాబాద్ లోనూ 8 సర్కిళ్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్ లో ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటిల్లో కఠిన ఆంక్షలు వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు.