Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్... కొత్త జడ్జీలకు రాష్ట్రపతి ఓకే
By: Tupaki Desk | 2 May 2020 3:30 AM GMTప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచాన్ని పీడిస్తున్న వేళ... నిజంగానే తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు హైకోర్టులకు నలుగురు కొత్త న్యాయమూర్తులను కేటాయిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో నలుగురు న్యాయమూర్తులను తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కేటాయిస్తున్నట్లుగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటన మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. వారిలో జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ సురేష్ రెడ్డి, జస్టిస్ లలితకుమారి ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ విజయసేన్ రెడ్డి కొత్త న్యాయమూర్తి అందుబాటులోకి రానున్నారు. ఇప్పటికే ఈ నలుగురు కొత్త న్యాయమూర్తులను తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కేటాయించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. కొలిజీయం సిఫారసు చేసినా... ఆ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఓకే చెప్పేయడంతో ఈ నలుగురు న్యాయమూర్తులు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో త్వరలోనే చేరిపోనున్నారు.
తెలుగు నేల విభజన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత... అందులో పనిచేస్తున్న న్యాయమూర్తులనే ఇరు రాష్ట్రాల హైకోర్టులకు విభజించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఒకరిద్దరు న్యాయమూర్తులు అందుబాటులోకి వచ్చినా... పెద్ద ఎత్తున వస్తున్న కేసులు, పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ నలుగురు న్యాయమూర్తులు అందుబాటు లోకి రానుండటం తో పరిస్థితి కాస్తంత మెరుగయ్యే అవకాశాలున్నాయి.