Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల రైతులకి శుభవార్త ... కీలక నిర్ణయం తీసుకున్న జగన్ , కేసీఆర్ !
By: Tupaki Desk | 6 May 2020 9:11 AM GMTదేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తు, విలయతాండవం చేస్తున్న సమయంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దేశానికి నేనున్నాననే భరోసానిచ్చే అన్నదాతకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. దేశం ఇంతటి కష్ట కాలంలో ఉన్నప్పటికీ కూడా రైతులకి అండగా నిలుస్తున్న ప్రభుత్వాలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధుపై మాట్లాడుతూ..కరోనా వున్నా, మరో సమస్య వచ్చినా రైతు బంధు పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. రైతు బంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అలాగే, మరోవైపు అసెంబ్లీలో చెప్పినట్లుగానే రూ.25 వేల వరకూ రుణం తీసుకున్న రైతులందరికీ రుణ మాఫీ చేస్తాన్నారు. అందుకు కావాల్సిన రూ.1200 కోట్లను బుధవారమే విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.తెలంగాణలో మద్దతు ధరకు ధాన్యం కొంటున్నామన్నారు. చిల్లర రాజకీయాలు చేసే వారి మాటలు నమ్మి మోసపోవద్దు అని రైతులకి తెలియజేసారు.
ఇకపోతే, తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా రైతన్నకు మేలు చేసేలా కీలక చర్యలు చేపట్టింది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ వేళ రైతులకి సంబంధించిన సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది . పంట సేకరణతో పాటూ కీలక అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గతంలో సీఎం సూచనల మేరకు మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్ లో మార్పులు చేర్పులు చేసిన అధికారులు దాని పనితీరు గురించి వైఎస్ జగన్‌కు వివరించారు. ఈ యాప్‌కు కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ (సీఎం ఏపీపీ) గా నామకరణం చేశారు. జిల్లాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు చూస్తున్న జేసీలు అందరికీ ఈ యాప్‌పైన అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 30న రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్ పై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.