Begin typing your search above and press return to search.

అమెరికా వీసా కోసం ట్రై చేస్తున్న వారికి కచ్ఛితంగా గుడ్ న్యూసే

By:  Tupaki Desk   |   28 Feb 2022 2:47 AM GMT
అమెరికా వీసా కోసం ట్రై చేస్తున్న వారికి కచ్ఛితంగా గుడ్ న్యూసే
X
డాలర్ కలను తీర్చుకునేందుకు యూఎస్ వీసాకు మించింది లేదు. ఈ వీసాను సొంతం చేసుకోవటం కోసం పడే పాట్లు అన్ని ఇన్ని కావు. ఇందుకోసం ఎన్నో మొక్కులు మొక్కుకునే వారెందరో.ఇదిలా ఉంటే.. అమెరికా వీసాల కోసం అప్లై చేసే వారికి కచ్ఛితంగా గుడ్ న్యూస్ అనే మాట ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం విద్యార్థులు.. కార్మికులతో సహా అమెరికా వీసా కోసం జరిగే వ్యక్తిగత ఇంటర్వ్యూను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు.

ఈ ఏడాది డిసెంబరు 31 వరకు విద్యార్థులు.. కార్మికులు.. సంస్కృతిక కళాకారులకు సంబంధించిన వివిధ రకాల వీసాల వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లుగా అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త ఒకరు భారత కమ్యూనిటీ నేతలకు వెల్లడించారు.

సాధారణంగా విద్యార్థులకైతే.. ‘‘F, M, J’’.. ఉద్యోగులైతే ‘‘H-1, H-2, H-3, L’’.. సంస్కృతిక కళాకారులు , విశిష్ట ప్రతిభావంతులు అయితే.. ‘‘O, P, Q’’ లకు సంబంధించిన అప్లికేషన్లకు వీసా వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది భారతీయ అమెరికన్లకు దన్నుగా నిలుస్తుందని చెబుతన్నారు.

దక్షిణాసియా కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన దక్షిణ మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డోనాల్ తో జరిగిన సమావేశం అనంతరం.. వీసా ఇంటర్వ్యూల రద్దు అంశాన్ని వెల్లడించారు. అయితే.. ఈ వ్యక్తిగత ఇంటర్వ్యూల రద్దు అంశం వర్తించాలంటే.. గతంలో అమెరికాకు సంబంధించిన ఏదైనా వీసా పొంది ఉండాలి.

అయితే.. గతంలో వీసాలు రిజెక్టు అయిన వారు.. తగిన అర్హత లేని వారికి మాత్రం ఇది వర్తించదని చెబుతున్నారు. ఈ ఏడాదికి 20 వేలకు పైనే వీసా అప్లికేషన్లను అమెరికా ప్రభుత్వం ఆహ్వానించింది. ఏమైనా.. అమెరికావీసా విషయంలో.. వ్యక్తిగత ఇంటర్వ్యూ లేకుండా జారీ చేసే లక్ ఎంతమంది సొంతం చేసుకుంటారో చూడాలి.