Begin typing your search above and press return to search.
విటులది తప్పేం కాదు.. వారిపై కేసులు వద్దు: కోర్టు సంచలన తీర్పు
By: Tupaki Desk | 3 May 2022 6:30 AM GMTఒక్కోసారి కోర్టులు ఇచ్చే తీర్పులు షాక్ కు గురిచేస్తాయి.. ఆశ్చర్యాన్నీ కలగజేస్తాయి.. తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎక్కువ సంతోషాన్ని పొందడానికి కొందరు వ్యభిచార గృహాలను ఆశ్రయిస్తుంటారు. వ్యభిచారం నిర్వహించే వారితో పాటు అక్కడికి వెళ్లేవారిది కూడా ఇంతకాలం తప్పుగానే భావించారు. కానీ తాజాగా ఇచ్చిన కోర్టు తీర్పు ప్రకారం.. వ్యభిచార గృహానికి వెళ్లే విటులది తప్పు కాదని, వారు కస్టమర్లు మాత్రమేనని పేర్కొంది. గతంలో పోలీసుల రైడింగ్ లో పట్టుబడిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరుపున న్యాయవాది వాదనలు విన్న కోర్టు విచారించి.. ఆ తరువాత ఇలాంటి తీర్పునిచ్చింది. విటులను నేరస్తులుగా భావించొద్దని తెలిపింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే..
అక్రమంగా సంబంధాలను కలిగి ఉండడం చట్టబద్ధంగా తప్పు. అయితే కొందరు డబ్బుకోసం.. ఇతర కారణాలతో వ్యభిచార గృహాలను నిర్వహిస్తుంటారు. అమాయకులైన అమ్మాయిలు, మహళల అవసరాలను ఆసరాగా చేసుకొని వారిని ఈ రొంపిలోకి దించుతారు. కొందరు తమ తాపం తీర్చుకోవడానికి ఈ గృహాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే చాలాసార్లు ఇలాంటి గృహాలపై పోలీసులు దాడి చేసి వ్యభిచారం నిర్వహించకుండా అడ్డుకుంటారు.
కానీ కొందరు అక్రమంగా అనుమతులు తెచ్చుకొని వారి దందా సాగిస్తున్నారు. అయితే వ్యభిచార గృహాలను నిర్వహించడంతో పాటు ఇక్కడికి వచ్చే విటులది కూడా తప్పేనని ఇంతకాలం భావించారు. ఒకవేళ పోలీసులు రైడింగ్ లో విటులు పట్టుబడితో నిర్వాహకులతో సమానంగా కేసులు పెట్టేవారు.
2020లో గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వ్యభిచార గృహానికి వెళ్లాడు. పోలీసుల రైడింగ్ లో దొరికిపోయాడు. అయితే ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో కోర్టును ఆశ్రయించాడు. తాను కస్టమర్ మాత్రమేనని, తనపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని చట్టాల్లో ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు.
అయితే పిటిషన్ తరుపున న్యాయవాది విటుడి తరుపున వాదించారు. ఇంటిని వ్యభిచార గృహంగా మార్చి నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయొచ్చని, కానీ అక్కడికి వెళ్లే కస్టమర్లది తప్పులేదని రమేశ్ అనే న్యాయవాది అన్నారు. వాదనలు విన్న కోర్టు విటుడిపై నమోదైన కేసును రద్దు చేస్తూ విటులపై కేసులు నమోదు చేయకూడదని పేర్కొంది.
ఇంతకాలం వ్యభిచార గృహాలను నిర్వహించడంతో పాటు అక్కడికి వెళ్లేవారిపై కేసులు నమోదు చేసేవారు. అయినా ఈ దందా కొనసాగేది. కానీ ఓ వ్యక్త వేసిన పిటిషన్ పై ఏపీ కోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే విటులపై కేసులు నమోదు కానంతమాత్రాన ఈ అక్రమ దందా ఆగుతుందా..? అని కొందరు అనుకుంటున్నారు. వ్యభిచార గృహాలపై చర్యలు తీసుకోవడం మానేసి విటులపై కేసులు నమోదు చేయొద్దన్న తీర్పుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏయిడ్స్ లో దేశంలో రెండో స్థానంలో ఉన్న ఏపీ.. కోర్టు ఇలాంటి తీర్పు నివ్వడంతో మరిన్ని విమర్శలు వస్తున్నాయి.