Begin typing your search above and press return to search.
గ్రేటర్ లో గెలిచిన వారికి గుడ్ న్యూస్
By: Tupaki Desk | 16 Jan 2021 10:33 AM GMTగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలపై మరో అప్ డేట్ వచ్చింది. ఎన్నికలు జరిగి నెలరోజులకు పైగా అవుతున్న తెలంగాణ సర్కార్ ఈ గెలుపును గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయలేదు. గెలిచిన అభ్యర్థులను అధికారికంగా గుర్తించలేదు. ఈ క్రమంలోనే బీజేపీ కార్పొరేటర్లు ఇప్పటికే తెలంగాణ భవన్ ను ముట్టడించి కేసీఆర్ సర్కార్ కు సెగ పుట్టించారు.
బీజేపీ నుంచి ఒత్తిడి తీవ్రమవుతున్న వేళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్ విడుదల చేశారు. ఫిబ్రవరి 10తో గ్రేటర్ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. వారి పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇక ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరుగనుంది.
డిసెంబర్1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే మేయర్ ఎంపిక ఇప్పటివరకు జరగలేదు. ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది.
ఇక పోటీచేసిన అభ్యర్థులంతా ఎన్నికల్లో చేసిన ఖర్చును ఎన్నికల సంఘానికి అందించాలి. లేకపోతే భవిష్యత్తులో పోటీకి అనర్హులు అవుతారు. మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 11 వరకు ఆగాల్సిందే.