Begin typing your search above and press return to search.

అమెరికా వెళ్లే వారికి ఇది గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   30 Nov 2022 4:54 AM GMT
అమెరికా వెళ్లే వారికి ఇది గుడ్ న్యూస్
X
అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలంటే కనీసం మూడు సంవత్సరాల వరకూ స్లాట్ లేని పరిస్థితి. సిబ్బంది కొరతతో ఇమ్మిగ్రేషన్ వీసాల గడువు సంవత్సరం నుంచి మూడేళ్ల వరకూ పెరిగింది. హైదరాబాద్ లో ప్రస్తుతం 900 రోజుల వరకూ ఉంది. దీంతో అమెరికాకు అత్యవసరంగా.. తమ కుటుంబసభ్యులను చూసేందుకు వెళ్లేవారికి నరకం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పండుగ సీజన్ లో ఉపశమనం ఇచ్చింది అమెరికా.. పర్యాటకులకు గుడ్ న్యూస్ తెలిపింది.

అమెరికాలో డిసెంబర్, జనవరి వరకూ పండుగ సీజన్. ఇది సెలవుదినం. చాలా కుటుంబాలు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. వీటిని ఆస్వాదించడానికి.. క్రిస్మస్‌ సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి అమెరికాకి వెళ్లాలని అందరూ కోరుకుంటాయి.అమెరికా వీసాలు మాత్రం మూడేళ్ల వరకూ ఖాళీ లేని పరిస్థితి.

ఈ క్రమంలోనే అమెరికాకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి భారతదేశంలోని అమెరికన్ కాన్సులేట్‌లు B1/ B2 వీసా దరఖాస్తుదారుల కోసం అనేక స్లాట్‌లను తెరిచాయి. అయితే ముంబై, ఢిల్లీ మరియు చెన్నైలలో డిసెంబర్‌లో ఇంటర్వ్యూ మినహాయింపులకు అర్హులైన వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

హాలిడే వీసాల కోసం ఇప్పుడే బుక్ చేసుకోవాలని ప్రజలను కోరుతూ యుఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లీలో 233 రోజులు, ముంబైలో 297 రోజులు , చెన్నైలో 171 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుదారులు గడువు ముగిసిన 48 నెలలలోపు B1/B2తో సహా ఏదైనా వీసాను రెన్యువల్ చేసుకుంటే ఇంటర్వ్యూ మినహాయింపును ఎంచుకోవచ్చు.

మరోవైపు, మొదటిసారి దరఖాస్తు చేసుకున్నవారికి, వేచి ఉండే సమయం ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు. ముఖ్యంగా ఇంటర్వ్యూ మినహాయింపుకు అర్హత లేని వారికి మూడేళ్ల వరకూ అమెరికా వెళ్లే ఛాన్స్ లేదు. పెరుగుతున్న బ్యాక్‌లాగ్‌లను పరిష్కరించడానికి, అమెరికా దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ మినహాయింపులకు.. డ్రాప్‌బాక్స్ కేసులను తీర్పు కోసం విదేశాలకు పంపడానికి.. తాత్కాలిక సిబ్బందిని నియమిస్తోంది.

విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నైపుణ్యం కలిగిన కార్మికులు, పునరావృత B1/B2 వీసా కోరేవారు , సిబ్బంది కోసం డ్రాప్‌బాక్స్ కేసులను వేగవంతం చేస్తోంది. అయితే ఈ చర్యలు ఉన్నప్పటికీ, ఇంటర్వ్యూ వెయిటింగ్ టైమ్ డ్రాప్ కావడానికి చాలా నెలలు పట్టే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.