Begin typing your search above and press return to search.
శుభవార్త చెప్పిన భారతీయ రైల్వే ..టికెట్లపై 50 శాతం డిస్కౌంట్
By: Tupaki Desk | 20 Dec 2019 8:13 AM GMTభారతీయ రైల్వే ..ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కొత్తగా 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రైల్వే ఈ-టికెట్లపై 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఐఆర్ సీటీసీ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకున్న సీనియర్ సిటిజన్స్ సహా పలువురికి టికెట్ ధరపై రాయితీ అందిస్తోంది.
నెలకు రూ.5,000 కన్నా తక్కువ సంపాదిస్తున్నవారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ రైలు టికెట్లపై ఈ రాయితీని ఉపయోగించుకోవచ్చు. అది కూడా సాధారణ రైలు సర్వీసులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక కోచ్‌లకు ఈ రాయితీ వర్తించదు. రాయితీ కేవలం బేసిక్ ఫేర్ పైన మాత్రమే అని, రిజర్వేషన్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు యథాతథంగా ఉంటాయి అని తెలిపింది. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక కోచ్‌లకు ఈ రాయితీ వర్తించదు. ఒక స్టేషన్ దగ్గర్నుంచి మరో స్టేషన్‌కు 300 కిలోమీటర్ల పైన సెకండ్, స్లీపర్ క్లాస్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రయాణించేవారికి రాయితీతో టికెట్లను ఆఫర్ చేయనుంది.