Begin typing your search above and press return to search.

కత్తి మహేష్ ఆరోగ్యంపై గుడ్ న్యూస్.. కానీ..

By:  Tupaki Desk   |   27 Jun 2021 10:46 AM GMT
కత్తి మహేష్ ఆరోగ్యంపై గుడ్ న్యూస్.. కానీ..
X
కత్తి మహేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని.. ఆయన కోమాలో ఉన్నారన్న వార్తలు మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. అయితే ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏమీ లేదని ఆయన స్నేహితుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఎక్కడెక్కడ ఎలాంటి గాయాలు అయ్యాయి.? ఆరోగ్యం ఎలా ఉందనేదానిపై స్పందించారు.

కత్తి మహేష్ ఆరోగ్యంపై ఆయన సన్నిహితులు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆరోగ్యపరిస్థితిని వివరిస్తున్నారు. తాజాగా వెంకట్ ఫేస్ బుక్ లో హెల్త్ బులిటెన్ పై పోస్ట్ చేశారు.

వెంకట్ సిద్ధారెడ్డి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘కత్తి మహేష్ ఆరోగ్యం స్తిమితంగానే ఉందని..బ్రెయిన్ ఇంజ్యూరీ పెద్దది కాకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని చెప్తున్నారు. మేం కూడా అక్కడి వైద్యులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం.. ఇప్పటికైతే కత్తికి ప్రాణాపాయం అయితే లేదని తెలుస్తోంది. ఇది సంతోషించాల్సిన విషయం’ అని గుడ్ న్యూస్ ను ఆయన తెలిపారు.

ఇక కత్తి మమేష్ కంటికి అయిన గాయంపై వైద్యులు పరిశీలించిన తర్వాత చెప్తానన్నారని.. ఈ రోజు క్లారిటీ వస్తుందని వెంకట్ సిద్ధారెడ్డి తెలిపారు.

ఇక చెన్నై పోలో ఆస్పత్రి వైద్యులు సైతం తాజాగా బులిటెన్ విడుదల చేశారు. ‘కత్తి మహేష్ కు ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేదు. కానీ డీఏఐ వల్ల తర్వాత సమస్యలు ఉంటాయి. అవి ఏంటి అనేది వైద్యులు ఇంకా నిర్ధారణకు రాలేదు. రెస్పిరేషన్ లేదని ఇంకా వెంటిలేటర్ మీదే ఉంచారు. శంకర్ నేత్రాలయ నుంచి వచ్చిన వైద్య బృందం మహేష్ ను పరిశీలిస్తున్నారని.. వాళ్లు చెప్పగానే మరింత ఆరోగ్యపరిస్థితిపై చెప్తాం’ అని పేర్కొన్నారు. దీంతో కత్తి మహేష్ కు ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తేలిపోయింది.