Begin typing your search above and press return to search.
ఆ దేశం వెళ్లేవారికి గుడ్ న్యూస్ .. .కొవాగ్జిన్‌కు ఆమోదం !
By: Tupaki Desk | 29 Oct 2021 7:39 AM GMTగల్ఫ్ దేశమైన ఒమన్ భారతీయ ప్రయాణికుకు శుభవార్త చెప్పింది. కొవాగ్జిన్ తీసుకున్న వారు సైతం ఒమన్ వెళ్లేందుకు అంగీకారం తెలిపింది. తమ దేశంలో ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్ల జాబితాలో కొవాగ్జిన్ ను కూడా చేర్చుతున్నామని, కాబట్టి ఈ టీకా తీసుకున్నవారు ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేకుండా తమ దేశంలో అడుగుపెట్టవచ్చని ఒమన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా బయలుదేరడానికి కనీసం 14 రోజుల ముందు రెండు డోసుల కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారు ఒమన్ చేరుకున్న తర్వాత 14 రోజుల క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
తమ దేశానికి చేరుకోవడానికి ముందు ఆర్ టీపీసీఆర్ కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చినట్లు నివేదిక ఉంటే చాలని తెలిపింది. ఈ మేరకు మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా ఆంక్షలను తొలగిస్తూ సెప్టెంబర్ 1 నుంచి భారత్ తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రయాణికులు తమ దేశంలో అడుగుపెట్టవచ్చని ఒమన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమోదం పొందిన టీకాలు వేసుకున్నవారికి మాత్రమే తమ దేశంలో ప్రవేశం ఉంటుందని కొన్ని నిబంధనలు విధించింది.
అదేవిధంగా ప్రయాణికులు తమ దేశంలో అడుగుపెట్టిన తర్వాత కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజా ఉత్తర్వులతో ఈ నిబంధనల నుంచి ఉపశమనం కలగనుంది. భారత్ బయోటెక్ కు చెందిన కరోనా టీకా కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆమోదం మరికొంత ఆలస్యం కానున్నది. తుది ‘రిస్క్-బెనిఫిట్’ అంచనాను నిర్వహించేందుకు డబ్ల్యూహెచ్‌వోకు చెందిన సాంకేతిక సలహా బృందం భారత్ బయోటెక్‌ను అదనపు వివరణలను కోరింది. ఈ బృందం వచ్చే నెల 3న భేటీ అవుతుంది.