Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్.. ట్విట్టర్లో టిక్ టాక్ ఫీచర్?
By: Tupaki Desk | 12 Dec 2021 6:00 AM ISTటిక్ టాక్... ఈ పేరు పిల్లల నుంచి వృద్ధుల దాకా సుపరిచితమే. టిక్ యాప్ అందుబాటులోకి వచ్చిన కొంత కాలంలోనే తెగ పాపులర్ అయింది. అందుకు కారణం షార్ట్ వీడియోస్. స్వైపింగ్ వీడియో ఫీచర్స్ వల్ల ఫుల్ క్రేజ్ దక్కింది. అయితే ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆ అప్లికేషన్ ను భారత్ లో నిషేధించారు. అయితే టిక్ టాక్ తరహా ఫీచర్లతో చాలా యాప్ అందుబాటులోకి వచ్చాయి.
వాటిలో ఇన్ స్టా గ్రామ్ రీల్స్, స్నాప్ చాట్, స్పాట్ లైట్, యూట్యూబ్ షార్ట్స్ వంటివి టిక్ టాక్ క్లోన్లు ప్రజాదరణ పొందాయి. అయితే ట్విట్టర్ కూడా ఇదే మార్గంలో నడపనున్నట్లు తాజాగా ప్రకటించింది.
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫాం ట్విట్టర్ లోనూ త్వరలో వీడియో స్వైపింగ్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయని ట్వీట్ చేసింది. వినియోగదారుల కోసం ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది.
అంతేకాకుండా ఎంపిక చేసిన వినియోగదారుల ఫోన్ లోని ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ ఈ వీడియో ఫీచర్ ను పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. ట్విట్టర్ యాప్ లోని ఎక్స్ ప్లోరల్ పేజీని టిక్ టాక్ లాంటి పేజీ గా మార్చడానికి సన్నాహాలు చేస్తోంది.
ట్విట్టర్ లో ఈ వీడియో ఫీచర్ అందుబాటులోకి వస్తే నెటిజన్లు... తమకు నచ్చిన కంటెంట్ ను స్వైపింగ్ ద్వారా వీక్షించవచ్చు. వీడియోలు, ఫోటోలు, టెక్ట్స్ వంటివి వినియోగదారుడి ఆసక్తిని బట్టి ఒకదాని తర్వాత మరొకటి వస్తాయి. వినియోగదారునికి అవసరమయ్యే కంటెంట్ ను మాత్రమే చూపించే దిశగా ఇంటర్ ఫేస్ ను తయారు చేస్తుంది.
అది యూజర్ అభిరుచి మేరకు ఫీడ్ ను ఇస్తుంది. కాగా వినియోగదారుల ఆసక్తులకు అనుగుణంగా... ట్రెండ్ ను ఫాలో అవడం కోసం ఈ స్వైపింగ్ ఆప్షన్ తీసుకువస్తున్నట్లు ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు. ఇది వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించారు.
షార్ట్ వీడియో బాటలో పయనించే పలు యాపులు ప్రజాదరణ పొందాయి. అందుకే దిగ్గజ సంస్థలు సైతం ఇదే బాటలో నడవడానికి ఆసక్తి చూపుతున్నాయి. కాగా ట్విట్టర్ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. సమాచారాన్ని చేరవేయడంలో ట్విట్టర్ ఇప్పటికే మంచి ఫ్లాట్ ఫాం గా నిలిచింది.
అయితే ప్రస్తుతం యూజర్ల ఆసక్తి మేరకు ఈ వీడియో స్వైపింగ్ అంశాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇది ఎప్పుడు వస్తుందనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి పరీక్షల దశలో ఉన్నట్లు ట్విట్టర్ ఇండియా వెల్లడించింది.