Begin typing your search above and press return to search.
సారు తీపికబురు ఖర్చు లెక్క ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 12 March 2021 4:05 AM GMTఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదున్నర గంటల పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కూర్చొని.. చర్చలో పాల్గొని.. ఉపాధ్యాయ.. ఉద్యోగులకు ఇస్తామన్న 29 శాతం ఫిట్ మెంట్ తీపికబురుకు సంబంధించిన లెక్క ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పక్కనున్న ఏపీ కంటే రెండు శాతం ఎక్కువ ఇస్తామన్న మాట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మోము మీద సంతోషం విరిసిల్లేలా చేయటం బాగానే ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ఖజానా మీద పడే భారం భారీగా ఉంటుందని చెబుతున్నారు. సారు చెప్పినట్లుగా 29 శాతం ఫిట్ మెంట్ కానీ ఇవ్వటం ఖాయమైతే.. ఏటా అందుకోసం అదనంగా రూ.8వేల కోట్ల భారం మీద పడనుందని అంచనా వేస్తున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. ఎన్నికలు అయ్యాక ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పినప్పటికి.. అనధికారికంగా మాత్రం మీద పడే పోటు భారం లెక్కలు వేసేస్తున్నాయి అధికార వర్గాలు. త్వరలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. కొత్తగా అమలు చేసే ఫిట్ మెంట్ కారణంగా ప్రభుత్వం మీద పడే అదనపు భారాన్ని బడ్జెట్ లో అడ్జెస్టు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఉద్యోగుల జీతభత్యాలు.. పింఛన్ల కోసం ప్రభుత్వం ఏటా దగ్గర దగ్గర రూ.30వేల కోట్ల వరకు వెచ్చిస్తోంది. కొత్త ఫిట్ మెంట్ వల్ల రూ.8వేల కోట్ల మేర భారం పడనుంది. ఇది సరిపోదన్నట్లుగా నిరుద్యోగులకు ఇస్తామని చెబుతున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 నుంచి 20 లక్షల మంది వరకు నిరుద్యోగులు నిరుద్యోగ భృతి.. అసరా పింఛన్ల లబ్దిదారుల వయసు తగ్గింపు నిర్ణయంతో మరో రూ.10వేల కోట్ల మేర అదనపు భారంగా పడుంది.
అంటే.. మొత్తంగా రూ.20 వేల కోట్ల మేర భారం పడటం ఖాయమని చెప్పాలి. ఇప్పటికే అప్పులతోబండి లాగిస్తున్న ప్రభుత్వం మీద రూ.20వేల కోట్ల అదనపు భారాన్ని ఎలా తట్టుకుంటుంది? అంత భారీగా ఆదాయం ఒక్కసారిగా పెరిగే అవకాశం లేదు. దీంతో.. ఈ భారాన్ని మోసేందుకు భూముల్ని అమ్మటం మినహా మరో మార్గం లేదన్న మాట వినిపిస్తోంది. స్థాయికి మించిన హామీలు ఇవ్వటం ఎందుకు? ఆస్తుల్ని అమ్మి మరీ.. వాటిని తీర్చటం ఎందుకు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇలా అమ్ముకుంటూ పోతే.. కొన్నాళ్లకు ప్రభుత్వం వద్ద ల్యాండ్ బ్యాంకే ఉండదు. అదే జరిగితే.. రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనాల్సి ఉంటుందన్న మాట.