Begin typing your search above and press return to search.
కలాం సలాం: ఆయనలో ఆసక్తికర కోణాలెన్నో..!
By: Tupaki Desk | 28 July 2015 9:35 AM GMTకోట్లాదిమందికి స్ఫూర్తిదాతగా నిలిచిన ఏపీజే అబ్దుల్ కలాంలో మేజిక్ ఏంది? ఆయన్ను ఎందుకంతగా ఆరాధిస్తారు? ఆయన్ను ఎందకంత ప్రేమిస్తారు? ఒక మనిషిని నచ్చేవాళ్లు నలుగురుంటే.. నచ్చనోళ్లు ఒకరిద్దరైనా మామూలే. కానీ.. దేశమంతా కలాంను ఎందుకు అంతగా కీర్తిస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు.. ఆయన జీవితమే. ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు.
+ ఎవరికైనా ఫోన్ చేసి భారత రాష్ట్రపతి పదవి చేపడతారా? అని ప్రశ్నిస్తే.. ఎగిరి గంతేసి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఓకే చెబుతారు. కానీ.. అబ్దుల్‌కలాం మాత్రం ఆలోచించుకోవటానికి సమయం కావాలని అడిగారు. తన అభిప్రాయాల్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు రాష్ట్రపతి పదవి ఒక వేదిక అవుతుందన్న ఉద్దేశంతో మాత్రమే ఆయన అత్యున్నత పదవిని అంగీకరించారు.
+ డీఆర్ డీవో భవనానికి రక్షణ కోసం.. ఎత్తైన గోడల మీద గాజుపెంకులు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే.. ఈ ప్రతిపాదనకు కలాం ఒప్పుకోలేదు. అలా చేస్తే.. పక్షులకు గాయాలు అవుతాయని.. అలాంటిది వద్దని చెప్పారు.
+ ఒక ప్రాజెక్టు పనిని అప్పగించారు కలాం. ఆ సైంటిస్ట్ ఏమో.. ఇంటి దగ్గర పిల్లల్ని ఎగ్జిబిషన్ కు తీసుకెళతానని భార్యకు మాటిచ్చారు. ఆఫీసు పనిలో పడి ఆ విషయాన్ని మర్చిపోయారు. పని పూర్తి అయిన తర్వాత తానిచ్చిన మాట గుర్తుకొచ్చి తెగ ఫీలయ్యాడు. భారమైన మనసుతో ఇంటికి వచ్చాడు. సీరియస్ గా ఉంటుందనుకున్న భార్య చాలా సంతోషంగా వచ్చి.. ఆయనకు థ్యాంక్స్ చెప్పింది.ఎందుకంటే.. పిల్లల్ని ఆ ఉద్యోగి బాస్ (కలాం) స్వయంగా ఎగ్జిబిషన్ కు తీసుకెళ్లి.. ఇంటికి తీసుకొచ్చారు మరి. తన దగ్గర పని చేసే వారికి సంబంధించిన యోగక్షేమాలు కలాం అంతగా పట్టించుకుంటారు.
+ సంగీతమంటే చెవి కోసుకునే కలాం హైదరాబాద్ లో ఉన్న కాలంలో వీణ నేర్చుకున్నారు. దాని గురించి ఎప్పుడైనా ప్రస్తావన వస్తే.. అవును.. మేడమ్ కల్యాణి అని గొప్ప టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకున్నానని వినమ్రంగా చెబుతారు.
+ పేదరికంలో పెరిగిన కలాం పేపర్ బాయ్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో స్కాలర్ షిప్ మీద ఆధారపడి ఆయన చదువుకున్నారు. స్కాలర్ షిప్ మొత్తం తక్కువగా ఉండటంతో ఆయన మాంసాహారాన్ని వదిలేసి శాఖాహారాన్ని తీసుకోవటం మొదలు పెట్టారు. చివరకు ఆయన మాంసాహారాన్ని వదిలేసి.. పూర్తిగా శాఖాహారిగా మారిపోయారు. ఆర్థిక పరిస్థితులే తనను శాఖాహారిగా మార్చాయని చెప్పినా.. తర్వాత పరిస్థితులు మారినా ఆయన మాత్రం మాంసాన్ని ముట్టుకోలేదు.
+ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారోత్సవానికి 64 మంది బంధువుల్ని ఢిల్లీ ఆహ్వానించారు కలాం. ఆ సందర్భంగా వారికి రవాణా.. బస మొత్తం ఖర్చులు ఆయనే పెట్టుకున్నారు.
+ తిరువనంతపురంలో శాస్త్రవేత్తగా పని చేసే సమయంలో రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్ లో తినేవారు. రాష్ట్రపతి హోదాలో తిరువనంతపురం రాజ్ భవన్‌కు వెళ్లిన ఆయన.. తాను భోజనం చేసిన చిన్న హోటల్‌యజమానిని ఆహ్వానించారు. తనకు అనుబంధం ఉన్న ఎవరిని ఆయన మర్చిపోయేవారు కాదు.
+ కలాంను చూసిన వెంటనే అందరిని ఆకర్షించేది ఆయన హెయిర్ స్టైల్. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. పొడవుగా జారి పడేలా ఉండే ఆయన హెయిర్ స్టైల్ ని ఆయన పూర్వీకులు పెంచుకునేవారట. దీంతో కలాం కూడా ఆ స్టైల్ నే ఇష్టపడేవారు. పెద్ద పెద్ద సెమినార్లలో పాల్గొని ప్రసంగించే సమయంలోనూ.. తన జుట్టును పైకి జరుపుకుంటూ ప్రసంగించటం కలాం ప్రత్యేకత.