Begin typing your search above and press return to search.

మంచి నిద్రతోనే పడక 'సుఖం'..వింటున్నారా..!

By:  Tupaki Desk   |   24 Dec 2022 6:13 AM GMT
మంచి నిద్రతోనే పడక సుఖం..వింటున్నారా..!
X
నిద్ర అనేది వయస్సును బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలు.. చిన్నారులు.. మధ్య వయస్సు వారు.. వృద్ధులు ఇలా కేటగిరీల వారీగా నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించాల్సిందే. లేనట్లయితే ఆ ప్రభావం తదుపని మన దైనింత జీవితంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్రపై జరిగిన పరిశోధనల్లో మనిషి సగటున ఐదు నుంచి ఆరు గంటలు నిద్ర పోయినట్లయితే రోజంతా హుషారుగా పని చేస్తాడని తేలింది. మంచి నిద్ర అనేది అనేక శారీరక.. మానసిక సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు నిద్రలేమితో ఒత్తిడితోపాటు శారీరక సంబంధమైన సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

తాజాగా ఓ పరిశోధనలో సగటున 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే మగవారి శరీరంలో పది శాతం టెస్టోస్టెరాన్ ను కోల్పోయినట్లు తేలింది. అంటే వీరంతా సుమారు 10 సంవత్సరాల వయస్సులో వారిలా ప్రవర్తిస్తారు. ఇక మహిళల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వెల్లడైంది. మరోవైపు వీరంతా బాగా నిద్ర పోయినపుడు వీరిలో 14 శాతం మెరుగైన లైంగిక కోరికను ప్రదర్శించారని వెల్లడైంది.

ఇక నిద్ర అనేది సంతోషకరమైన హర్మోన్ల పడి ఉంటుందని తేలింది. ఒంటరిగా నిద్రపోయే వారి కంటే తమ భాగస్వామితో కలిసి నిద్రపోయే వారు మంచి నిద్రను కలిగిన ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ఇందులో గురకు బాధితులను మినహాయించారు. మరోవైపు కొందరు ఉదయం.. సాయంత్రం వేళల్లో వేర్వుగా పని చేసే భార్యాభర్తలు నిద్రలేమితో ఇబ్బందులు పడినట్లు వెల్లడైంది.

ఎవరైతే సుమారు ఐదు గంటల పాటు మంచి నిద్రను కలిగి ఉంటారో వారిలో లైంగిక మెరుగైన కోరికలు కలగడం వల్ల ఆ దంపతులు పడక సమయాన్ని అద్భుతంగా గడుపుతున్నారని చెప్పారు. దీంతో మంచి నిద్ర అనేది మంచి ఆరోగ్యానికి.. ఆనందకరమైన జీవనానికి.. లైంగిక సుఖానికి బలమైన పునాది వేస్తుందని నిరూపించబడిందని నిపుణులు పేర్కొంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.