Begin typing your search above and press return to search.

వాట్సాప్, ఫేస్‌బుక్ కి గుడ్ బై ... ఇండియాలో సొంత సోషల్‌ మీడియా !

By:  Tupaki Desk   |   6 March 2020 6:32 AM GMT
వాట్సాప్, ఫేస్‌బుక్ కి గుడ్ బై ... ఇండియాలో  సొంత సోషల్‌ మీడియా !
X
సోషల్ మీడియా ... ప్రస్తుతం సమాజంలో అగ్రస్థానంలో ఉంది. ఏ విషయాన్ని అయినా క్షణాల వ్యవధిలో సమాచారాన్ని చేరవేస్తూ, ఊహకందని రీతిలో దూసుకుపోతుంది. అయితే, ఈ సోషల్ మీడియా వెబ్ సైట్స్ కి అమెరికా అమ్మలాంటిది. ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న సోషల్ మీడియా సంస్థలైన పేస్ బుక్, వాట్సాప్ ...అమెరికాకి చెందినవే. అయితే, గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా హ్యాకింగ్ మరియు డేటా దొంగతనం కేసులు పెరుగుతున్న సమయంలో భారత ప్రభుత్వం సొంత సోషల్‌ మీడియాను రూపొందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు భారత్ కి ఎటువంటి సొంత సోషల్ మీడియా మాధ్యమాలు లేకపోవడం తో అటు వైపుగా అడుగులు వేస్తున్నట్టు టెక్ మహీంద్రా సీటీఓ, జాతీయ భద్రతా నిపుణుడు అమిత్ దుబే తెలిపారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో దుబే మాట్లాడుతూ..దేశంలో సొంత ఫేస్‌బుక్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్‌ లాంటి వాటిని రూపకల్పన చేయడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

వ్యక్తిగత డేటా భారీగా భారతదేశం నుండి బయటికి రావడంతో.. దేశంలో సామాజిక మాధ్యమాలకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యిందని, ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో డ్రాఫ్ట్‌ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. చైనాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ పనిచేయదని దుబే తెలిపారు. పౌరుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. పౌరుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.