Begin typing your search above and press return to search.

గూగుల్ 10 కోట్ల చాలెంజ్.. ప్రయత్నించండి

By:  Tupaki Desk   |   22 Nov 2019 9:29 AM GMT
గూగుల్ 10 కోట్ల చాలెంజ్.. ప్రయత్నించండి
X
ప్రపంచంలోనే నంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్. దీన్ని తలదన్నే మొగాడు ఇంకా పుట్టలేదు అని భావిస్తుంటుంది. అయితే గూగుల్ ను కూడా షేక్ చేసే హ్యాకర్ల వ్యవహారం అప్పుడప్పడూ బయటపడుతోంది. అయితే ప్రతీసారి అప్ డేట్ అవుతూ హ్యాకర్లకు చిక్కకుండా తన వ్యవస్థను నిర్మించుకుంటోంది గూగుల్.

తాజాగా స్మార్ట్ ఫోన్ హ్యాకర్లకు గూగుల్ సవాల్ విసిరింది. కొత్తగా గూగుల్ తీసుకొచ్చిన అప్ డేటేడ్ గూగుల్ పిక్సల్ స్మార్ట్ ఫోన్ ను ఎవరైనా హ్యాక్ చేయగలిగితే వారికి గూగుల్ 1.5 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 10 కోట్లకు పైగా బహుమతిని ఇస్తానని ప్రకటించింది.

గూగుల్ తన తయారీ పిక్సెల్ ఫోన్ భద్రతను పరీక్షించేందుకు ఈ సవాల్ చేసింది. గూగూల్ పిక్సెల్ ఫోన్ లో టైటాన్ ఎం స్ట్రాంగ్ సెక్యూరిటీ చిప్ ను గూగుల్ అమర్చింది. ఇది ఫోన్ ను హ్యాక్ కాకుండా డేటా చోరీ కాకుండా కాపాడుతుంది. సో ఎంతో పకడ్బందీగా తయారు చేసిన ఈ ఓఎస్ ఫోన్ ను ఎవరూ హ్యాక్ చేయలేరని చెబుతోంది.

అయితే గతంలో గూగుల్ తయారు చేసిన ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ ను ఇప్పటిదాకా 1800 మంది హ్యాక్ చేసి చూపించారు. వారందరికీ గూగుల్ 4 మిలియన్ డాలర్లను చెల్లించింది. తాజా ఓఎస్ పై సవాల్ చేసింది.. సో ఔత్సాహికులు ఈ గూగుల్ సవాల్ ను స్వీకరించి హ్యాక్ చేయవచ్చు.10 కోట్లను బహుమతిగా గెలుచుకోవచ్చు.. సో ప్రయత్నించండి..