Begin typing your search above and press return to search.
ఉద్యోగులకు సరికొత్త ఫార్ములాను తీసుకొచ్చిన గూగుల్
By: Tupaki Desk | 23 Oct 2021 11:30 AM GMTప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి.. కోట్లాది మందిని ఇళ్లకే పరిమితం చేసిన కరోనా మహమ్మారి దిగులు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తుందనుకున్న వేళ.. మళ్లీ చైనా.. రష్యా.. బ్రిటన్ లాంటి దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతుంటే.. అందుకు భిన్నంగా భారత్ లో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు సరికొత్త ఫార్ములాను తెర మీదకు తీసుకొచ్చారు. కరోనాకు ముందు ఉద్యోగులంతా ఆఫీసులకు వెళ్లే వారు. కానీ.. మహమ్మారి దెబ్బకు ఇంటి నుంచి పని చేయటానికే ఇష్టపడుతున్నారు.
ఒకవేళ కంపెనీలు తమ ఉద్యోగులకు.. ఆఫీసులకు రావాలని అడిగితే.. అందుకు ససేమిరా అనటమే కాదు.. కావాలంటే వేరే కంపెనీకి వెళ్లిపోవటానికి సిద్ధమవుతున్నారు. దీంతో.. ఉద్యోగుల విషయంలో కంపెనీలు కత్తి మీద సాములాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటివేళ.. ప్రపంచంలోని పలు కార్పొరేట్ కంపెనీలకు ఉప యుక్తంగా ఉండే ఒక ఫార్ములాను గూగుల్ తెర మీదకు తీసుకొచ్చింది. ఈ ఫార్ములా కానీ సక్సెస్ అయితే మిగిలిన కంపెనీలు ఎంచక్కా దీన్ని వాడుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఫార్ములాను సింపుల్ గా ‘2/3’ అని చెప్పొచ్చు. ఈ అంకెలే గూగుల్ అనుసరించే విధానాన్నిచెప్పేస్తాయి. అర్థం కాలేదా? వివరంగా చెబుతాం.
ఈ ఫార్ములా ప్రకారం వారంలో రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయటం.. మిగిలిన మూడు రోజులు ఇంటి నుంచి పని చేయటంగా చెబుతున్నారు. కొవిడ్ వేళ నెలల తరబడి ఇంటి నుంచి పని చేస్తున్న వారు.. ఇప్పటికిప్పుడు ఆఫీసుకు రావటానికి ఇష్టపడటం లేదు. మూడో వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని..ఇప్పటికిప్పుడు ఆఫీసుకు వచ్చి రిస్కు తీసుకునే కన్నా.. మరికొద్ది రోజులు ఆగాలన్న ఆలోచనను వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటివేళ.. ఈ ఫార్ములాతో ఆఫీసుకు వచ్చేలా ఆకర్షింపచేసి.. తర్వాతి రోజుల్లో పాత విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. గూగుల్ ప్లాన్ చేసిన ఫార్ములాను తొలుత అమెరికాలో అమలు చేయాలని భావిస్తున్నారట. అక్కడ ఉద్యోగుల నుంచి వచ్చిన ఫలితం ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయనున్నారట. మిగిలిన కంపెనీలు సైతం గూగుల్ ప్రయోగాన్ని పరిశీలించి..అందుకు తగ్గట్లు నడుచుకోవటం ఖాయమని చెబుతున్నారు. మరి గూగుల్ ఫార్ములాకు ఐటీ ఉద్యోగులు ఎలా రియాక్టు అవుతారో?