Begin typing your search above and press return to search.
గూగుల్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా సుందర్ పిచాయ్ మాట
By: Tupaki Desk | 16 Aug 2022 6:56 AM GMTచదివితే ఫలానా కాలేజీలో చదవాలన్న మాట చాలామంది నోటి నుంచి వింటాం. ఉద్యోగం చేస్తే గూగుల్ లో చేయాలన్న మాటను సంబంధం లేని రంగాలకు చెందిన ఉద్యోగుల నోటి నుంచి వస్తూ ఉంటుంది. గూగుల్ లో జాబ్ అంటే అంతటి క్రేజ్.
ఉద్యోగుల్ని ఇంటి అల్లుళ్ల మాదిరి చూసుకుంటుందన్న పేరున్న ఈ కంపెనీలో.. జాబ్ వస్తే చాలు లైఫ్ సెట్ అయిపోయినట్లే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు గూగుల్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా మారాయి.
ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తుండటం.. వివిధ రంగాలకు ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తున్న వేళ.. ఖర్చుల్ని తగ్గింపుపై కంపెనీలు ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి వేళలోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సైతం పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
తాజాగా కంపెనీలో జరిగిన టాప్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో.. కంపెనీలో పని చేసే వారు తక్కువన్న మాట గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్లోఆదాయాలు.. రాబడుల పరంగా అంచనాల కంటే తక్కువగా ఉండటంపై సుందర్ పిచాయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
ఉద్యోగుల పని తీరును ప్రశ్నించిన ఆయన.. ఉద్యోగుల తొలగింపునకు సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ?ఇప్పటికే రిక్రూట్ మెంట్ ను నిలిపివేసిన గూగుల్.. ఇప్పుడు ఉద్యోగుల్ని తొలగిస్తుందన్న మాట అందులోపని చేసే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.