Begin typing your search above and press return to search.

ప్రైవసీ డేటా ఆరోపణలు: చిక్కుల్లో గూగుల్ సీఈవో సుందర్

By:  Tupaki Desk   |   30 Dec 2021 6:30 AM GMT
ప్రైవసీ డేటా ఆరోపణలు: చిక్కుల్లో గూగుల్ సీఈవో సుందర్
X
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొత్త సమస్యల్లో చిక్కుకున్నారు. గూగుల్ యూజర్ల ప్రైవసీ విషయంలో గోప్యతకు భంగం కలిగించారని ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. చట్టవిరుద్ధంగా యూజర్లకు సంబంధించిన ఇంటర్నెట్ వినియోగాన్ని ట్రాక్ చేశారని ఫిర్యాదు చేశారు. ఇన్ కాజినెటో బ్రౌజింగ్ మోడ్ ద్వారా అల్ఫాబెట్ ఇంక్ యూజర్ల ఇంటర్నెట్ కు సంబంధించిన యూజర్ల డేటాను ట్రాక్ చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో ఆయనను రెండు గంటల పాటు ప్రశ్నించాలని కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే సుందర్ పిచాయ్ కు ఇలా ట్రాక్ అవుతుందని ముందే తెలుసునని, కావాలనే యూజర్ల ప్రైవసీకి భంగం కలిగేలా కంపెనీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

ఇన్ కాజినెట్ బ్రౌజింగ్ విషయంలో సుందర్ పిచాయ్ 2019లోనే యూజర్లను హెచ్చరించారు. ఇన్ కాజినెట్ మోడ్ సమస్యాత్మకమైనదని తెలిపారు. ఇది కేవలం యూజర్ల డాటా సేవ్ చేయకుండా ఆపివేస్తుందని గూగుల్ తెలిపింది. అయితే ఇటీవలి కాలంలో అల్ఫాబెట్ యూనిట్ పై గోప్యతా, ఆన్ లైన్ నిఘాపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 2020లో ఓ వ్యక్తి గూగుల్ క్రోమ్ బౌజర్లకు వెళ్లినప్పుడు యూజర్లు ప్రైవేట్ మోడ్ కు వెళ్లినప్పుడు యూజర్లకు తెలియకుండా ఇంటర్నెట్ వినియోగాన్ని ట్రాక్ చేసిందని దావా వేశాడు.

సుందర్ పిచాయ్ కి క్రోమ్ బ్రౌజర్, గోప్యతలపై పూర్తి అవగాహన ఉందని అతని ఈ సమస్యలను పరిష్కరించగలుగుతాడని గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టనెడా రాయిటర్స్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కొత్త అభ్యర్థనలు అసంబద్ధమైనవని అన్నారు. ఈ కేసులో దావాలను మేము పూర్తిగా సమాధానం ఇస్తామన్నారు. అంతేకాకుండా మమ్మల్ని మేం రక్షించుకోగలుగుతామని తెలిపారు. కాలిఫోర్నయాలోని శాన్ జోస్ లోని యూఎస్ మెజిస్ట్రేట్ జడ్జి సుసాన్ వాన్ క్యూలెన్ సోమవారం ‘సుందర్ పిచాయ్ నిర్ధిష్ట సమాచారం ఇచ్చారని, అతనికి మద్దతుగా కొన్ని పత్రాలు ఉన్నాయని న్యాయవాదులు తెలిపారని’ ఉత్తర్వులు ఇచ్చారు.

ఇప్పటికే గూగుల్ వేదికగా ఇష్టమొచ్చిన పోస్టులు పెడుతూ ఎదుటి వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కొందరు ఆరోపించారు. ముఖ్యంగా తెలుగు సినీ నిర్మాత అప్పట్లో సుందర్ పిచాయ్ కు ఓ లేఖ రాశారు. తన కూతురుని చంపుతామని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే దానిని తీయించడానికి కష్టతరమైందని, ఇలా అయితే ఎలా అని సుందర్ పిచాయ్ ను బన్నీ వాసు ప్రశ్నించారు. ఒకరు పెట్టిన పోస్టు అబద్ధమని నిరూపించడానికి ఇన్ని కష్టాలు పడాలా..? అని ప్రశ్నించారు. అయితే ఇంటర్నెట్ స్వేచ్ఛ గురించి సుందర్ పిచాయ్ కామెంట్లు చేయడంపై ఆయన ఈ లేఖ రాశారు.

తాజాగా ఇదే స్వేచ్ఛ యూజర్ల డాటా చోరీకి గురవుతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టనెడా ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ విషయం చెప్పారు. ‘గూగుల్ క్రోమ్ లోని మీ బ్రౌజర్ యాక్టివిటీస్ ను సేవ్ చేయకుండానే బ్రౌజ్ చేసే ఎంపికను అందిస్తుంది. ప్రతీసారి కొత్తదానితో చేస్తున్నట్లే. మీరు కొత్త ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు అవసరమనుకున్న సమాచారాన్ని ఈజీగా సేకరించవచ్చు.’ అని తెలిపారు.

గత ఏడాది జూన్లో గూగుల్ పై ముగ్గురు ఫిర్యాదు చేశారు. విస్తృతమైన డాటాను ట్రాకింగ్ చేస్తున్నారని, ఇలా యూజర్ల డేటాతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. క్రోమ్ ఓపెన్ చేసిన తరువాత బ్రౌజింగ్ మోడ్ యూజర్ డేటాను సేకరిస్తుంది. ఇలా వినియోగదారుల డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుంది. గూగుల్ అనలైసిస్, యాడ్స్, వెబ్ సైట్ ప్లగ్ ఇన్, ఇతర అప్లికేషన్లను చూపిస్తూ వినియోగదారుల డేటాను చోరీ చేస్తోందని ఆరోపించారు.