Begin typing your search above and press return to search.
అబే సాలే అంటే గూగుల్ సీఈఓ ఏమనుకున్నాడంటే
By: Tupaki Desk | 5 Jan 2017 1:32 PM GMTగూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తనకు ఎదురైన వింత అనుభవాన్ని ఆసక్తికరంగా పంచుకున్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన.. గురువారం తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్ పూర్ కు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో అప్పటి తన క్యాంపస్ ముచ్చట్లను పంచుకున్నారు. దీంతో పాటు ఎన్నో ఆసక్తికర విషయాలను సుందర్ చెప్పుకొచ్చారు. తాను చదువుకునే రోజుల్లో అంతంతమాత్రం హిందీ వచ్చేదని, అందుకే కొందరు అబె.. సాలె.. అని పిలిచినా అదేదో గ్రీటింగ్ అనుకునేవాడినని ఆయన చెప్పారు.
ఎంతో కష్టపడితేగానీ ఐఐటీకి వచ్చే అవకాశం రాలేదని, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం క్లాస్ లను బంక్ కొట్టేవాడినని సుందర్ గుర్తు చేసుకున్నారు. క్లాస్ లను బంక్ కొట్టడం కాలేజీ సాంప్రదాయమని కూడా అన్నారు. ఆయన ఈ మాట అన్నపుడు విద్యార్థులు అరుపులతో తమ మద్దతు తెలిపారు.రాత్రులు చాలాసేపటి వరకు మేల్కొనే ఉండి - ఉదయం క్లాస్ లకు వెళ్లేవాడిని కాదని ఆయన చెప్పారు. కాలేజీ చదువులు మరీ అంత ముఖ్యం కాదని - అసలు చదువు రిస్క్ తీసుకొనే తత్వాన్ని ప్రోత్సహించాలని సుందర్ అన్నారు. కంప్యూటర్ ను తొలిసారి తాను ఇక్కడే చూసినట్లు చెప్పారు.
తన లవ్ స్టోరీని కూడా ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ విద్యార్థులతో పంచుకున్నారు. తన భార్య అంజలిని క్యాంపస్ లోనే చూసినట్లు ఆయన చెప్పారు. అయితే క్యాంపస్ లో రొమాన్స్ చాలా కష్టమయ్యేదని - గర్ల్స్ హాస్టల్ కు వెళ్లే చాన్సే దక్కేది కాదని గుర్తుచేసుకున్నారు. ఎవరో ఒకరు బయట నిల్చొని.. అంజలి.. సుందర్ నీ కోసం వచ్చాడు అని చెప్పేవారని సుందర్ అన్నారు. 25 ఏళ్ల ముందు క్యాంపస్ కు వచ్చినపుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉందని చెప్పారు. సుందర్ పిచాయ్ పర్యటన సందర్భంగా ఆయన్ను చూడటానికి వెనుక బెంచీలపై ఎక్కడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/