Begin typing your search above and press return to search.
ఫేక్ న్యూస్ కు గూగుల్ చెక్.. కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..!
By: Tupaki Desk | 25 May 2021 9:40 AM GMTఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం, అంతర్జాలం పెరిగింది. సామాజిక మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అంతటా వ్యాపిస్తోంది. అయితే ఈ సాంకేతికతో ఎంత ప్రయోజనం ఉందో అంతే స్థాయిలో దుష్ప్రయోజనాలు ఉన్నాయి. అసత్య వార్తలూ వేగంగా ప్రచారం అవుతున్నాయి. ఏది నిజం, ఏది అబద్ధమో తేల్చుకోలేని స్థితిలో ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
అసత్య వార్తలను కట్టడి చేయడానికి ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్ లు కొన్ని ఫీచర్లు తీసుకొచ్చాయి. అయితే వాటి పని తీరు వేరే విషయం. కాగా ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. 'అబౌట్ దిస్ రిజల్ట్' పేరిట ఆ సమాచారం సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? అందులో వాస్తవమెంత? అనే ఫలితాలు చూపించనుంది. దానిని బట్టి తప్పుడు సమాచారం పట్ల వినియోగదారులను హెచ్చరించనుంది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఈ కొత్త ఫీచర్ గురించి చర్చించినట్లు గూగుల్ వెల్లడించింది.
ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రావడానికి గూగుల్, వికీపీడియా సంయుక్తంగా పని చేయనున్నాయి. సమాచారం మూలాలను తెలుసుకోవడంతో పాటు వికీపీడియా లింకులను చూపిస్తుంది. వేలాది మంది వాలంటీర్లు ఇచ్చే సమాచారంపై ఈ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇది చాలా అప్డేట్ గా ఉంటుందని గూగుల్ పేర్కొంది. కేవలం నమ్మదగిన సమాచారాన్ని మాత్రమే వినియోగదారుల ముందు ఉంచుతుందని తెలిపింది. హెచ్టీటీపీఎస్ ఆధారంగా ఆ సమాచారం ఎంతవరకు నమ్మశక్యమనేది నిర్ధారిస్తుందని వెల్లడించింది. బ్రౌజింగ్ డేటా గోప్యతను చూడవచ్చని వివరించింది.
అమెరికాలో ఫిబ్రవరి నుంచి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ లో ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది తెలిపింది. మిగతా భాషల్లో త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ తో ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టినట్లవుతుందని టెక్ నిపుణులు అంటున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను ఎక్కువ మంది వాడుతున్న నేపథ్యంలో ఇలాంటి సురక్షిత ఫీచర్లు అవసరమని చెబుతున్నారు.