Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిలో గూగుల్ ఫ్రీ వైఫై

By:  Tupaki Desk   |   18 April 2016 8:50 AM GMT
ఏపీ రాజధానిలో గూగుల్ ఫ్రీ వైఫై
X
గూగుల్ తన ఉచిత వైఫై సువలను విస్తరిస్తుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని మూడు రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు ప్రారంభించింది. ముఖ్యంగా ఏపీ నూతన రాజధాని అమరావతికి సమీప పట్టణం - ప్రధాన రైల్వే జంక్షన్ అయిన విజయవాడ రైల్వే స్టేషన్లో గూగుల్ ఫ్రీ వైఫై సేవలు ప్రారంభమవుతున్నాయి. భారత రైల్వేల అనుబంధం విభాగం రైల్ టైల్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం దేశంలోని పలు రైల్వేల స్టేషన్లలో వైఫై ద్వారా ఉచిత ఇంటర్నెట్ అందిస్తుంది. గత ఏడాది ముంబయి సెంట్రల్ స్టేషన్లో మొట్టమొదటిసారిగా ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది. తాజాగా ఏపీలోని విజయవాడ సహ మరో 10 స్టేషన్లకు విస్తరించింది.

కొత్తగా విజయవాడ - విశాఖపట్నం - పుణె - భువనేశ్వర్ - భోపాల్ - రాంచీ - రాయ్ పూర్ - కాచిగూడ(హైదరాబాద్) - ఎర్నాకుళం జంక్షన్(కోచి)లో ఈ సేవలు ప్రారంభించింది. దీని ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉచిత ఇంటర్నెట్ అందుతుందని అంచనా. గూగుల్ - రైల్ టెల్ కలిసి ఈ ఏడాది 100 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై అందించనున్నాయి. మొత్తం 500 స్టేషన్లలో గూగుల్ వైషై సేవలు కల్పిస్తామని గత ఏడాది డిసెంబరులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇండియా వచ్చిన సందర్భంగా ప్రకటించారు. రైల్వేల్లో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తుండడం... ప్రయాణికుల సేవల్లో చాలావరకు ఇంటర్నెట్ ఆధారితం కావడంతో ఉచిత వైఫై అందిస్తే ప్రయాణికులకు పండగే అని చెప్పొచ్చు. టిక్కెట్లు - రిటైరింగ్ రూములు బుక్ చేసుకోవడం నుంచి ఎన్నో సేవలు ఇంటర్నెట్ ఆధారితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇది శుభపరిణామమే.