Begin typing your search above and press return to search.
గూగుల్‌కు అధిరిపోయే జరిమానా.. వందలు కాదు వేల కోట్లే!
By: Tupaki Desk | 14 July 2021 12:30 AM GMTఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు అదిరిపోయే జరిమానా పడింది. ఫ్రాన్స్‌కు చెందిన యాంటీట్రస్ట్ ఏజెన్సీ.. టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. వార్తల ప్రచురణ విషయంలో స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆదేశాలు ఉల్లంఘించిన నేపథ్యంలో 500 మిలియన్ యూరోల ఫైన్ వేసింది. భారత కరెన్సీలో ఈ జరిమానా విలువ రూ.4,415 కోట్లు. దీంతో ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
విషయం ఇదీ..
వార్తా సంస్థలు, గూగుల్ మధ్య చాలా కాలంగా పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. తమ వార్తల్ని 'గూగుల్ న్యూస్'లో ప్రచురించి ప్రకటనల రూపంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందని వార్తా సంస్థల యజమానుల వాదన. ప్రకటనల ఆదాయంలో తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చాయి. వివిధ మీడియా సంస్థలకు చెందిన వార్తల్ని ప్రచురించడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు గూగుల్‌కు కొంత సమయం ఇచ్చాయి.
నిర్లక్ష్యమే కారణమా?
ఫ్రాన్స్ యాంటీ ట్రస్ట్ ఏజెన్సీ కూడా స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో భారీ జరిమానా విధించాలని నిర్ణయించింది. ఫ్రాన్స్ ప్రభుత్వ చట్టాల్ని, నిబంధనల్ని అమలు చేయడంలో గూగుల్ జాప్యం చేసిందని.. తద్వారా కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే 4 వేల కోట్లకు పైగా జరిమానా విధించడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. గూగుల్ నిర్లక్ష్యమే దీనికి కారణమని అంటున్నాయి.. దిగ్గజ సంస్థలు. మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.