Begin typing your search above and press return to search.

ఆన్‌ లైన్‌ లో గూగుల్ పాఠ‌శాల రెఢీ

By:  Tupaki Desk   |   22 Sep 2015 5:27 PM GMT
ఆన్‌ లైన్‌ లో గూగుల్ పాఠ‌శాల రెఢీ
X
గూగుల్ సంస్థ స‌రికొత్త నిర్ణ‌యాల‌తో ప్ర‌పంచాన్ని కొత్త పుంత‌లు తొక్కిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాణ్య‌త‌తో కూడిన యాప్స్ రాక‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు ఆన్‌ లైన్‌ లో కొత్త డిగ్రీ కోర్సులు ప్రారంభించింది. గూగుల్ ఇండియా ఎండీ రాజ‌న్ ఆనంద్ ఆ విష‌యాన్ని వెల్ల‌డించారు. నెల‌కు రూ. 9,800 ఫీజుతో ఈ కోర్సును ఆఫ‌ర్ చేయ‌నున్నారు. ఈ కోర్సు కాల వ్య‌వ‌ధి 6-9 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. కోర్సు పూర్త‌యిన వెంట‌నే ఫీజులో 50 శాతాన్ని తిరిగి చెల్లిస్తారు. ఈ లెక్క‌న చూస్తే గూగుల్ కేవ‌లం నెల‌కు రూ.4,900 ఫీజుతో ఐటీ డిగ్రీ విద్య‌ను అతి త‌క్కువ వ్య‌వ‌ధిలో మ‌న‌కు అందిస్తోంది.

ఈ కోర్సు నేర్చుకున్న వారిలో 1000 మంది మెరిట్ విద్యార్థుల‌ను ఎంపిక చేసి వారికి ఉప‌కార‌వేత‌నాలు మంజూరు చేస్తారు. అలాగే ఈ కోర్సు పూర్తి చేసిన వారు త‌ర్వాత జాబ్ ఫెయిర్ లో ఉద్యోగాలు పొందేందుకు త‌మ‌వంతు సహకారం అందిస్తామని రాజన్ ఆనంద తెలిపారు.భారత్ లో 36 లక్షల మంది ఐటీ డెవ‌ల‌ప‌ర్లు ఉన్నార‌ని..అయితే వీరిలో చాలా మందికి స‌రైన శిక్ష‌ణ లేక‌పోవ‌డంతో క్వాలిటీ లేకుండా స్థాయికి త‌గిన‌ ఉపాధి పొంద‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న వాపోయారు..

ఐడీ డెవ‌ల‌ప‌ర్ల‌కు స‌రైన స్థాయిలో శిక్ష‌ణ అందిస్తే ఇండియా ఈ రంగంలో మ‌రింత దూసుకెళుతుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై యాప్స్ అభివృద్ధి చేసేలా సాఫ్ట్ వేర్ డెవలపర్లకు శిక్షణ ఇస్తామని, టాటా గ్రూప్ తో కలసి ఈ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను యువ‌త‌కు చేరువ చేయనున్నామని ఆయ‌న చెప్పారు. గూగుల్ నిర్ణ‌యం వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా ఐటీ రంగం మ‌రింత క్వాలిటీతో దూసుకెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంది.