Begin typing your search above and press return to search.

మోడీని క్రిమిన‌ల్ చేసిన గూగుల్‌

By:  Tupaki Desk   |   20 July 2016 10:41 AM IST
మోడీని క్రిమిన‌ల్ చేసిన గూగుల్‌
X
ప్ర‌స్తుతం ఇండియాతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మోడీ పేరు మార్మోగిపోతోంది. మోడీకి ఇటు జ‌నాల‌తో పాటు అటు సోష‌ల్ మీడియాలో కూడా వ‌ర‌ల్డ్‌ వైడ్‌ గా మంచి క్రేజ్ ఉంది. 2014 త‌ర్వాత మోడీ ప్ర‌పంచంలోనే ప్ర‌భావ‌శీల వ్య‌క్తుల్లో ఒక‌ర‌య్యారు. ఎన్నో కోట్ల మంది ఫాలోయింగ్ ఆయ‌న సొంతం. అలాంటి మోడీ గురించి గూగుల్‌ లో సెర్చ్ చేస్తే ఏమ‌ని రావాలి..ఇండియా ప్రైమ్ మినిస్ట‌ర్ అని క్లీయ‌ర్‌ గా రావాలి. అయితే గూగుల్ సంస్థ మోడీని ప్ర‌పంచంలోనే టాప్‌-10 మోస్ట్ వాంటెండ్ క్రిమిన‌ల్స్‌ లో ఒక‌రిగా చేర్చేసింది.

మోడీని ప్ర‌ముఖ‌ సెర్చింజన్ జెయింట్ గూగుల్ అవమానపరిచింది. ప్రపంచంలోని టాప్-10 నేరగాళ్లలో మోడీ ఒక‌ర‌ని పేర్కొంది. గూగుల్ సంస్థ చేసిన ఈ నిర్వాకానికి ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మోడీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. గూగుల్ మోడీని తీవ్రంగా అవ‌మానప‌రిచిందంటూ ఓ న్యాయ‌వాది అల‌హాబాద్ హైకోర్టును ఆశ్ర‌యించాడు. గూగుల్ సంస్థ‌తో పాటు సీఈవో - ఆ సంస్థ ఇండియా హెడ్‌ ల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే గూగుల్ సంస్థ వ‌ర‌ల్డ్ టాప్‌-10 క్రిమిన‌ల్స్ లిస్ట్ ఇదేనంటూ ఓ జాబితా ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో మోడీ పేరు కూడా ఉంది. దీన్ని గ‌మ‌నించిన ఆల‌హాబాద్ న్యాయ‌వాది సుశీల్‌ కుమార్ ఆ జాబితా నుంచి మోడీ పేరు తీసేయాల‌ని గూగుల్‌ ను కోరారు. అయితే గూగుల్ నుంచి ఎలాంటి స్పంద‌నా రాక‌పోవ‌డంతో సుశీల్ చివ‌ర‌కు అల‌హాబాదు చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును విచారించిన సీజేఎం కోర్టు గ‌త న‌వంబ‌ర్‌ లో ఈ పిటిష‌న్‌ ను కొట్టేసింది.

సీజేఎం కోర్టు నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ సుశీల్ అలహాబాదులోని మరో కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివిజ‌న్ పిటిష‌న్‌ పై బుధ‌వారం విచార‌ణ చేసిన కోర్టు గూగుల్ సంస్థ‌తో పాటు ఆ సంస్థ సీఈవో - గూగుల్ ఇండియా హెడ్‌ ల‌కు నోటీసులు జారీ చేయ‌డంతో పాటు వారిపై క్రిమిన‌ల్ కేసులు పెట్టాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.