Begin typing your search above and press return to search.
గూగుల్ డ్రైవర్ గా భారీ ఆఫర్?
By: Tupaki Desk | 17 May 2016 4:44 AM GMTవినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ప్రయోగాత్మకంగా తయారు చేసిన గూగుల్ డ్రైవర్ లెస్ కార్లను నడిపేందుకు అవసరమైన డ్రైవర్లు ఇప్పుడు అవసరమయ్యారు. డ్రైవర్ లెస్ కారు అయినప్పటికీ.. వాస్తవంలో ఇదెలా పని చేస్తుంది? దీని పనితీరు.. దీన్లో చేయాల్సిన మార్పులు చేర్పులు.. ప్రయాణ అనుభూతి? అనుకోకుండా ఎవరైనా కారుకు అడ్డం వస్తే కారు ఎలా రియాక్ట్ అవుతుంది? లాంటి విషయాల్ని పరిశీలించటంతో పాటు.. అవసరమైన సందర్బాల్లో కారును హ్యాండిల్ చేయటానికి వీలుగా డ్రైవర్లను నియమించుకోవాలని గూగుల్ సిద్ధమైంది. అయితే.. డ్రైవర్ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి డ్రైవింగ్ తో పాటు టైపింగ్ లోనూ పట్టు ఉండాలని లింకు పెడుతోంది. డ్రైవింగ్ కు.. టైపింగ్ కు లింకేమిటనుకుంటున్నారా? ఇక్కడే అసలు పాయింట్ ఉంది.
డ్రైవర్ లెస్ కారును ఉపయోగించే డ్రైవర్లు.. నిత్యం తాము ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్న విషయాల్ని నివేదికల రూపంలో అందించాల్సి ఉంటుంది. అందుకే.. టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి అని గూగుల్ చెబుతోంది. అదే సమయంలో తాను నియమించుకునే డ్రైవర్లను 24 నెలల పరిమిత కాలానికి సంబంధించి ఒప్పందం మీద డ్రైవర్లను అపాయింట్ చేసుకోనుంది. గంటకు రూ.1300 చొప్పున తమ డ్రైవర్ లెస్ కారు డ్రైవర్ కు వేతనం ఇవ్వాలని గూగుల్ భావిస్తోంది.
రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ పని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. రోడ్ల మీద మరింత ప్రయోగాత్మకంగా నడపాలని భావిస్తున్న గూగుల్ అందుకు తగ్గట్లుగా డ్రైవర్లను ఎంపిక చేయాలని భావిస్తోంది. తమ కార్లను ప్రయోగాత్మకంగా రోడ్ల మీద.. రియల్ కండీషన్లలో నడపాలని భావిస్తున్న గూగుల్.. అందుకు తగ్గట్లే డ్రైవర్ల ఎంపిక మీద ఫోకస్ చేసింది.
వారానికి ఐదురోజులు పని చేయాల్సిన ఈ డ్రైవర్లు.. నిత్యం తాము ఎదుర్కొన్న అంశాల్ని.. ఎదురైన అనుభవాల్ని నివేదికల రూపంలో కచ్ఛితంగా ఇవ్వాల్సి ఉంటుంది. గూగుల్ డ్రైవర్ లెస్ కార్ల డ్రైవర్లుగా పని చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి డ్రైవింగ్ లైసెస్స్ లోక్లీన్ రికార్డు ఉండాలని.. గతంలో ప్రమాదాలు చేసిన వారికి ఏ మాత్రంఅవకాశం ఉండని చెబుతున్నారు. ఎలాంటి క్రిమినల్ రికార్డులు ఉండకూడదని.. ఈ డ్రైవర్లు కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్న కండీషన్ ను పెడుతోంది. డ్రైవింగ్ ప్రావీణ్యంతో పాటు నిమిషానికి 40 పదాల చొప్పున టైపింగ్ చేయగల సామర్థ్యం అవసరమని చెబుతున్న గూగుల్ మరో కండీషన్ కూడా పెడుతోంది. అదేమంటే.. వారంలో 10వేల నుంచి 15వేల మైళ్ల దూరాన్ని డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 57కార్లను గూగుల్ సిద్ధం చేసింది. మరి.. గూగుల్ డ్రైవర్ల పోస్ట్ లకు ఎంతటి స్పందన వస్తుందో చూడాలి.