Begin typing your search above and press return to search.
ఇండియా పై గూగుల్ వివక్ష చూపుతోందా ..?
By: Tupaki Desk | 17 Feb 2020 5:30 PM GMTగూగుల్...ప్రస్తుతం ఇండియా లో టాప్ సెర్చ్ సైట్. అలాగే మనం ఎక్కడికైనా వెళ్లాలి అనుకోని , దారి తెలియని సమయంలో చాలామంది ఉపయోగించే సాధనం ఏది అంటే గూగుల్ మ్యాప్స్ అనే చెప్పాలి. అయితే, మ్యాపింగ్ పాయింట్ అఫ్ వ్యూ లో టాప్ లో ఉన్న గూగుల్ మప్స్ కొన్ని ప్రాంతాలను అభ్యంతరకరమైన రీతిలో చూపిస్తోందంటూ ఓ అమెరికన్ పత్రిక వెల్లడించింది. దీనికి ఉదాహరణగా కశ్మీర్ మ్యాప్ ను బయటపెట్టింది.
భారతదేశంలోని వాళ్లు గూగుల్ మ్యాప్స్‌లో చూస్తే జమ్మూకశ్మీర్ మొత్తం భారత్ లో భాగంగానే కనిపిస్తోంది. కానీ ఇతర దేశాల్లో వారికి మాత్రం మరో మ్యాప్ కనిపిస్తోంది. దానిలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ను సన్నని చుక్కల గీతతో గూగుల్ చూపిస్తోంది. అంటే ఈ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా గూగుల్ తెలుపుతోంది. అయితే , ఈ విషయం తెలుసుకున్న భారతీయులు గూగుల్ పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అయితే ,ఈ విషయంపై స్పందించిన గూగుల్ ప్రతినిధి.. ‘మేము మ్యాప్స్ విషయంలో పక్షపాత వైఖరి ప్రదర్శించం. ఆయా దేశాల చట్టాలు, అధికారిక సమాచారం మేరకే మ్యాప్స్ లో మార్పులు చేస్తాం. వారిచ్చిన డేటా ప్రకారమే ఆయా ప్రాంతాల్లో మ్యాప్స్ చూపిస్తాం. 2014లో తెలంగాణ రాష్ట్రం విషయంలో కూడా ఇదే చేశాం అని చెప్పారు. గూగుల్ నిబంధనల ప్రకారం వివాదాస్పద ప్రాంతాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు అందజేయాలని, దాని కోసమే ఇలా సన్నని చుక్కల గీతతో ఆయా ప్రాంతాలను చూపించడం జరుగుతోంది అని అయన తెలిపారు. అయితే గూగుల్ ఇలా ద్వంద వైఖరిని చూపిస్తుండటం పై భారత ప్రజానీకం మండిపడుతున్నారు.