Begin typing your search above and press return to search.
ఇక గూగుల్ అప్పు కూడా ఇప్పిస్తుందట
By: Tupaki Desk | 29 Aug 2018 5:31 AM GMTగూగుల్ సంస్థ తన పేమెంట్ యాప్ ‘తేజ్’ పేరును ‘గూగుల్ పే’గా మార్చింది. అంతేకాక తేజ్ యాప్ వినియోగిస్తున్న ఖాతాదారులకు ఇకపై రుణాలు కూడా ఇస్తామని వెల్లడించింది. గూగుల్ ఫర్ ఇండియా నాలుగో ఎడిషన్ సదస్సులో సంస్థ పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. తేజ్ యాప్ ద్వారా నగదు బదిలీ చేసిన వారికి ఇన్నాళ్లు సంస్థ స్క్రాచ్ కార్డులను ఇచ్చేది. వాటి ద్వారా ఖాతాదారులు కొంత క్యాష్ బ్యాక్ పొందేవారు.
భారతదేశంలోని గూగుల్ పే వినియోగదారులకు తాత్కాలిక రుణాలు ఇచ్చేందుకు గూగుల్ సంస్థ హెచ్ డీఎఫ్ సీ - ఐసీఐసీఐ - కోటక్ మహేంద్ర - ఫెడరల్ బ్యాంకులతో ఒప్పందం కూడా చేసుకుంది. వినియోగదారుని బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు - తేజ్ యాప్ లో లావాదేవీల ఆధారంగా బ్యాంకులు రుణ పరిమితిని ముందే నిర్ణయిస్తాయి. ఈ మేరకు వినియోగదారుడు కోరినప్పుడు రుణం మంజూరు చేస్తాయి. రుణ మొత్తం - గడువు - ఈఎంఐ తదితర విషయాలన్నీ గూగుల్ పే యాప్ లోనే కనిపిస్తాయి. అంతేకాక ఈఎంఐలను చెల్లించేందుకు వినియోగదారులు తమ గూగుల్ పే యాప్ లో ఆటో పే ఆప్షన్ ను కూడా వినియోగించుకోవచ్చు. పేరు మార్పు - రుణ సదుపాయం మినహా యాప్ యథాతథంగా ఉంటుందని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. 2017 - సెప్టెంబర్ 17న తేజ్ యాప్ ను లాంచ్ చేశారు.
ప్రతి నెలా 2.2 కోట్ల మంది భారతీయులు తేజ్ యాప్ లో లావాదేవీలు జరుపుతున్నారని, ఏడాదికి రెండు లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయని, 1.2 లక్షల మంది చిన్న వ్యాపారులు తేజ్ సేవలు వినియోగించు కుంటున్నారని గూగుల్ చెబుతోంది. మరోవైపు కోటి మంది యూజర్లు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్ లోని 12వేల గ్రామాలకు - పట్టణాలకు - నగరాలకు గూగుల్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకువస్తామని గూగుల్ చెబుతోంది.