Begin typing your search above and press return to search.

మ‌హీకి అరుదైన గౌర‌వం.. ‘ధోనీ సిక్స్’కు గూగుల్ గుర్తింపు!

By:  Tupaki Desk   |   18 Jun 2021 1:30 AM GMT
మ‌హీకి అరుదైన గౌర‌వం.. ‘ధోనీ సిక్స్’కు  గూగుల్ గుర్తింపు!
X
మైదానంలో ధోనీ బ్యాటింగ్ గురించి స్పెష‌ల్ గా ఇంట్రో ఇవ్వాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచంలోనే బెస్ట్ ఫినిష‌ర్ గా ప్ర‌శంస‌లు అందుకున్న జార్ఖండ్ డైన‌మైట్‌.. త‌న‌దైన రోజున ఎంత‌లా చెల‌రేగిపోతాడో తెలిసిందే. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచుల‌ను గెలిపించిన మ‌హీ.. త‌న‌దైన హెలీ కాఫ్ట‌ర్ షాట్ తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు. అయితే.. తాజాగా మ‌రో అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

గ‌తేడాది ఐపీఎల్ టోర్నీ యూఏఈలో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అభిమానులు లేకుండానే నిర్వ‌హించిన ఈ టోర్నీ.. వినోదం అందించ‌డంలో మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఈ టోర్నీలోనే ధోనీ అద్దిరిపోయే సిక్స్ కొట్టాడు. షార్జా స్టేడియంలో రాజ‌స్థాన్‌రాయ‌ల్స్ జ‌ట్టుతో జ‌రిగిన ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ చివ‌ర‌లో.. ధ‌నా ధ‌న్ బ్యాటింగ్ చేసిన మ‌హీ.. వ‌రుస సిక్సుల‌తో చెల‌రేగిపోయాడు.

అందులో ఓ సిక్సు ఏకంగా స్టేడియం బ‌య‌ట ప‌డింది. ఆ బంతిని ఓ వ్య‌క్త‌ తీసుకొని వెళ్లిపోయాడు కూడా! ఈ దృశ్యం స్టేడియంలోని కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అయితే.. ఆ బంతి ప‌డిన ప్రాంతానికి 'ధోనీ సిక్స్‌' అని పేరు పెట్టారు ఫ్యాన్స్‌. కొన్ని రోజులుగా ఈ విష‌యం ఆన్ లైన్లో చ‌ర్చ‌లో ఉంది.

ఈ పాయింట్ కు గూగుల్ మ్యాప్ లో గుర్తింపు ఇచ్చింది గూగుల్‌! ఈ మేర‌కు తాజాగా ధృవీక‌ర‌ణ వ‌చ్చింది. దీంతో.. మ‌హీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ధోనీనా.. మ‌జాకా అంటూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది అర్ధంత‌రంగా ఆగిపోయిన ఐపీఎల్‌.. మ‌రోసారి యూఏఈకి త‌ర‌లిపోతున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌రు 19 నుంచి దుబాయ్ లో టోర్నీ ప్రారంభం కానుంది. ఫైన‌ల్ మ్యాచ్ అక్టోబ‌రు 15న జ‌రుగుతుంది.