Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో ఇండియన్స్ ఎక్కువ ఏ వీడియోలు చూస్తున్నారంటే ?

By:  Tupaki Desk   |   6 Jun 2020 12:30 AM GMT
లాక్ డౌన్ లో ఇండియన్స్ ఎక్కువ ఏ వీడియోలు చూస్తున్నారంటే ?
X
మహమ్మారి వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్‌ తో ప్రపంచమంతా ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో కూడా దాదాపు రెండు నెలల పాటు లాక్‌ డౌన్ విధించటంతో ప్రజలంతా ఇంట్లోనే ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా వినోద పరిశ్రమ కూడా పూర్తిగా మూత పడటం, థియేటర్లు, సీరియల్స్‌ కూడా ఆగిపోవటంతో ప్రజలు ఎంటర్‌ టైన్మెంట్‌ కోసం డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ ను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ సంస్థ ఓ సర్వే నిర్వహించింది.

డిజిటల్‌ వీడియోలు చూస్తున్నవారి సంఖ్య ఏ స్థాయిలో పెరిగింది. ఏ భాషల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు అనే లెక్కలు వెల్లడించింది. భారతీయుల్లో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆన్‌ లైన్‌ లో వీడియోలు చూస్తున్నారు. దాదాపు రోజుకు గంటపాటు వీడియోలు చూస్తున్నట్టుగా వెల్లడించింది. అండర్‌ స్టాండింగ్‌ ఇండియాస్‌ ఆన్‌ లైన్ వీడియో వ్యూయర్‌ అనే పేరుతో ఈ సర్వే వివరాలను వెల్లడించింది గూగుల్. ఈ సర్వే ప్రకారం హిందీ వీడియోలను ఎక్కువగా చూస్తున్నారని తేల్చింది. దాదాపుగా 54 శాతం మంది హిందీ వీడియోలనే చూస్తున్నారట.

ఆ తరువాత ఎక్కువగా 16 శాతం మంది ఇంగ్లీష్ వీడియోలను చూస్తున్నారు. తెలుగు వీడియోలు మూడో స్థానంలో నిలిచాయి. దాదాపు ఏడు శాతం మంది తెలుగు వీడియోలు చేస్తున్నారు.తరువాతి స్థానంలో కన్నడ ఆరు శాతం, తమిళ వీడియోలను ఐదు శాతం, బెంగాళీ వీడియోలను మూడు శాతం చూస్తున్నారు. భవిష్యత్తుల్లో ఆన్‌లైన్‌లో వీడియోలు చూసే వారి సంఖ్య మరింత భారీగా పెరిగే అవకావం ఉందని గూగుల్‌ వెల్లడించింది.