Begin typing your search above and press return to search.

బోష్‌డీకే అంటే.. ఏంటి? గూగుల్ సెర్చ్ ఇంజ‌న్‌ను కుదిపేసిన వైనం

By:  Tupaki Desk   |   21 Oct 2021 3:30 PM GMT
బోష్‌డీకే అంటే.. ఏంటి?  గూగుల్ సెర్చ్ ఇంజ‌న్‌ను కుదిపేసిన వైనం
X
సాధార‌ణంగా నాయ‌కులు చేసుకునే విమ‌ర్శ‌ల‌కు.. పెద్ద‌గా అర్ధాలు వెతికే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. ఒక‌రిని మించి ఒక‌రు నాయ‌కులు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఒక‌ప్పుడు తిట్టుకున్నా.. హుందాగా ఉండేవి. కానీ, ఇప్పుడు హ‌ద్దులు దాటేశారు. అధికారంలో ఉన్న‌వారు.. లేనివారు కూడా నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత మ‌ట అనేస్తున్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య ప‌రిమితం కావాల్సిన ప‌దాల‌ను బ‌హిరంగంగా అనేస్తున్నారు. నాకొడ‌క‌.. వాడు.. వీడు.. అనేవి స‌ర్వ‌సాధార‌ణం గా మారిపోయాయి. ఈ క్ర‌మంలో తాజాగా టీడీపీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభి రాం.. చేసిన `బోష్డీకే` ప‌దం అర్ధం ఏంటి? తాజాగా సీఎం జ‌గ‌న్ చెప్పిందేనా? ఇదీ.. ఇప్పుడు.. ప్ర‌జ‌ల మ‌ధ్య విస్తృతంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌.

నిజానికి బోష్డీకే.. అనే ప‌దం మ‌న తెలుగు నాట కొత్త‌గా విన్న‌ది.. వింటున్న‌దీ కాదు. దీని అర్ధం తెలియ‌క పోయినా.. స‌ర‌దాగా న‌లుగురు ఫ్రెండ్స్ గుమిగూడితే.. మాట‌ల మ‌ధ్య‌లో అనుకునే మాట‌గా ఇది క‌లిసి పోయింది. ఇది ఔన‌న్నా.. కాద‌న్నా.. వాస్త‌వం. అయితే.. ప‌ట్టాభి చేసిన ఈ వ్యాఖ్య‌.. అనంత‌ర ప‌రిణామాల తో ఒక్క‌సారిగా .. అస‌లు బోష్డీకే అంటే.. ఏంటి? దీని అర్ధం ఏంటి? ఏయే సంద‌ర్భాల్లో అంటారు? అనే విష‌యాలు చాలా చాలా ఆస‌క్తిగా మారాయి. దీనికి సంబంధించి.. నెటిజ‌న్లు.. గూగుల్‌లో ఈ ఏడాది చేసిన సెర్చ్‌లో హైలెట్‌గా నిలిచింద‌ని తాజాగా గూగుల్ ప్ర‌క‌టించుకుంది. దీనిపై అంటే.. ఈ ప‌దంపై భాషాశాస్త్ర‌వేత్త‌లు కూడా దృష్టి పెట్టారు.

దీనికి సంబంధించి ఇప్ప‌టి వర‌కు ఉన్న వివ‌రణ‌ను చూస్తే.. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో.. `బోష‌డీ` అనే గ్రామాలు ఉన్నాయి. ఇవి ఇప్ప‌టికీ ఉన్న‌ట్టు గూగుల్ మ్యాప్ చూపిస్తోంది. గ‌తంలో బ్రిటీష‌ర్ల కాలంలో ఈ గ్రామాలు రెండూ కూడా నిర‌క్ష‌రాస్యుల‌కు పె ట్టింది పేరు. దీంతో ఆయా గ్రామాల నుంచి ఎవ‌రైనా.. ప‌ట్ట‌ణాల‌కు ప‌నుల నిమిత్తం ఎవ‌రైనా వ‌స్తే.. `బోష్‌డీకే వాలా ఆయేగా.. కామ్ దేదో!!`` అనే మాట వాడుకలోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అంటే.. పాపం.. బోష‌డీ ప్రాంతం నుంచి వ‌చ్చాడు.. అత‌నికిఏదైనా ప‌ని ఉంటే ఇవ్వండి.. అని అనేవారు. అయితే, రానురాను.. ఇది బూతు ప‌దంగా మారిపోయింద‌ని అంటున్నారు.

ఇలా చేసుకుంటే.. ఇలాంటిదే మ‌రో ప‌దం.. మ‌న‌కు వాడుక‌లో ఉంది. `డ‌కోటా గాడు` అనేది ఈ ప‌దం. దీనిని కూడా బూతుగానే ఇప్ప‌టికీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడుతుంటారు. మ‌రి దీని అర్ధం ఏంటి? అంటే... అమెరికాలోని ఒక ప్రాంతం పేరు డ‌కోటా. ఇప్ప‌టికీ ఉంది. ఈ ప్రాంతం నుంచి ఇండియాకు వ‌చ్చిన వారిని ఇలా వ్యాఖ్యానించేవారు. వీరు కొంత లేబ‌ర్‌గా ఉండేవారు. ప‌నుల కోసం.. ఇండియాకు వ‌చ్చేవార‌ని అనేవారు. ఇలా వ‌చ్చిందే డ‌కోటా గాడు. అయితే.. ఇది కూడా రాను రాను.. బూతుగానే మారిపోయింది. కానీ, సీఎం చెప్పిన‌ట్టు లం..కొడుకు.. అనేది కాద‌ని అంటున్నారు భాషా ప్ర‌వీణులు. జ‌గ‌న్‌ను కొంద‌రు దారి త‌ప్పించార‌ని చెబుతున్నారు. మ‌రి దీనిపై మున్ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు వ‌స్తాయో చూడాలి.