Begin typing your search above and press return to search.

రాజకీయ పార్టీలకు గూగుల్ షాక్ ...ఏంచేసిందంటే !

By:  Tupaki Desk   |   15 Jan 2021 7:23 AM GMT
రాజకీయ పార్టీలకు గూగుల్ షాక్ ...ఏంచేసిందంటే !
X
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ .. ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చింది. రాజకీయ ప్రకటనలు నిలిపి వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 14 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ నిషేధం జనవరి 21 వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ చేపట్టనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా గూగుల్ రాజకీయ ప్రకటనల విషయంలో పాక్షిక బ్యాన్ విధించింది.

అయితే, ఎన్నికలు ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత మళ్లీ ప్రకటనలకు అనుమతి ఇచ్చింది. ఇటీవల అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్, గూగుల్ అనుబంధ అన్ని విభాగాల్లోనూ ఎలాంటి రాజకీయ ప్రకటనలను తీసుకోదు. ఇదో సున్నితమైన అంశం కాబట్టి, తాము ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నట్టు గూగుల్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడి అభిశంసన, ప్రమాణస్వీకారం, నిరసనలకు సంబంధించి ప్రకటనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం అని గూగుల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ కూడా రాజకీయ ప్రకటనల మీద ఇప్పటికే నిషేధం విధించింది. గత నెలలో జార్జియాలో మాత్రం కొంచెం మినహాయింపులు ఇచ్చింది. విధ్వంసాలను, పరస్పర వ్యతిరేకతను ప్రోత్సహించే తరహా ప్రకటనలు తమ పాలసీకి విరుద్ధమని గూగుల్ కంపెనీ తెలిపింది.