Begin typing your search above and press return to search.
అధికారులకు అలా షాకిచ్చింది..గూగుల్ టెక్కీ భార్యకు కరోనా
By: Tupaki Desk | 14 March 2020 3:41 PM GMTఇండియన్ అథారిటీస్‌కు ఓ టెక్కీ భార్య (28) షాకిచ్చింది. బెంగళూరులోని గూగుల్ సంస్థలో పని చేసే టెక్కీకి కరోనా వైరస్ సైకింది. అతనిని వేరుగా ఐజోలేషన్‌లో ఉంచారు వైద్యాధికారులు. కానీ ఆమె అక్కడి నుండి తప్పించుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. దీంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత పరీక్షల్లో ఆమెకు కూడా కరోనా సోకిందని తెలిసింది. బెంగళూరు నుండి విమానం లో ఢిల్లీ మీదుగా ఆగ్రాలోని తన పేరెంట్స్ వద్దకు వెళ్లింది.
వైద్య అధికారులు తెలిపిన వివరాల మేరకు... గూగుల్ లో పని చేసే సదరు ఉద్యోగి తన భార్యను తీసుకొని హనీమూన్ కోసం ఇటలీ వెళ్లాడు. తిరిగి వచ్చాక అతనికి కరోనా సోకిందని తేలింది. భార్యకు కూడా వైరస్ సోకే ప్రమాదముందని అనుమానించిన అధికారులు ఆగ్రాలోని అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్రాలో ఆమె పుట్టింటికి వెళ్లగా ఆమె తండ్రి ఎవర్నీ లోనికి అనుమతించలేదు. ఆ తర్వాత ఉన్నతాధికారుల జోక్యం తో ఆమెకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆగ్రా హాస్పిటల్‌లో ఆమెను ఐజోలేషన్‌లో ఉంచారు.
ఆమె కుటుంబ సభ్యులను కూడా ఐజోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు, ఆమె బెంగళూరు మీదుగా ఢిల్లీ వెళ్లిన సమయంలో ఆమె ముందు, వెనుక కూర్చున్న వారిని, అలాగే రైలు లో ఆమె తో పాటు కలిసి ప్రయాణించి, ఆమెతో మాట్లాడిన వారిని కూడా స్క్రీనింగ్ చేయాల్సి ఉంది. వారిలో ఎవరికైనా వచ్చి ఉంటే మరింత మందిని పరీక్షించాల్సి ఉంటుంది.
దేశంలో కరోనా సోకకుండా ఉండాలంటే సెల్ఫ్ ఐజోలేషన్ చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే కేసుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. వీవీఎస్ లక్ష్మణ్ వంటి ప్రముఖులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చొరవ చూపుతున్నారు. అయితే చాలామంది టెక్కీలు వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.