Begin typing your search above and press return to search.

మీటూ.. గూగుల్ కూడా.. 48 మంది ఔట్

By:  Tupaki Desk   |   27 Oct 2018 5:09 AM GMT
మీటూ.. గూగుల్ కూడా.. 48 మంది ఔట్
X
మీటూ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. చిన్నా పెద్ద కంపెనీలనే కాదు.. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలకు కూడా ఈ మకిలి అంటుకుంది. గూగుల్ లాంటి ప్రఖ్యాత సంస్థలో కూడా కీచకులు బయటపడడం సంచలనం రేపుతోంది... సంస్థలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి వ్యక్తులు కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని డిస్మిస్ కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది..

ప్రఖ్యాత గూగుల్ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగినిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదుతో 48మంది సీనియర్ ఉద్యోగులను గూగుల్ సంస్థ తొలగించింది. ఇందులో 13మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు ఉండడం సంచలనం రేపుతోంది. ఆండ్రాయిడ్ క్రియేటర్ అయిన ఆండీ రూబిన్ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తేలడంతో ఆయనకు 90 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించి మరీ గూగుల్ బయటకు పంపేయడం కలకలం రేపింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు తాజాగా లేఖ విడుదల చేశారు.

గూగుల్ సంస్థలో గడిచిన రెండేళ్లుగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48మంది ఉద్యోగులను గుర్తించి తొలగించామని గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పేర్కొన్నారు. . ఎగ్జిట్ ప్యాకేజీ ఉన్న 13మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు మిలియన్ల పరిహారం చెల్లించి ఉద్యోగాల్లోంచి తీసేశామని అందులో పేర్కొన్నారు.. గూగుల్ లో పనిచేసే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని గూగుల్ సీఈవో లేఖలో తెలిపారు.