Begin typing your search above and press return to search.

ప్రపంచం మీద అల్ఫాబీట్ ప్రభావం ఎంతో..?

By:  Tupaki Desk   |   11 Aug 2015 8:54 AM GMT
ప్రపంచం మీద అల్ఫాబీట్ ప్రభావం ఎంతో..?
X
ఇప్పటివరకూ వినని పేరు.. మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందన్న అయోమయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఈ సంస్థను అల్లాటప్పా కంపెనీ స్టార్ట్ చేయటం లేదు. తాను లేకపోతే.. మనిషి జీవితంలో ఎంతో కోల్పోయినట్లుగా ఫీలయ్యేలా చేసిన గూగుల్ సంస్థ ప్రారంభించిన సంస్థ ఇది.

ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ ప్రభావం ప్రపంచం మీదెంతో. ఇవాల్టి రోజున గూగుల్ కనిపించకుంటే పిచ్చేక్కిపోయి.. పనేమీ చేయలేని వారు కోట్లల్లోనే ఉంటారు. ఇప్పుడీ కంపెనీ తాజాగా అల్ఫాబీట్ అనే సంస్థను స్టార్ట్ చేసింది. తమ కొత్త కంపెనీతో చాలానే చేసేస్తామని చెబుతున్నారు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లారీ పేజ్. అల్ఫాబీట్ పేరు తమకెంతో నచ్చిందని.. మనుషులు కనుకొన్న వినూత్నమైన దాన్లో ఇదొకటంటూ చాలానే చెప్పేస్తున్న ఆయన.. ఇంతకీ తామేం చేస్తామన్న విషయాన్ని మాత్రం చెప్పటం లేదు.

సెర్చింజన్ సేవలతో ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన గూగుల్.. తర్వాత కొన్ని వ్యాపారాల్ని చేసింది. అయితే.. అవేమీ ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే.. అల్ఫాబీట్ విషయంలో మాత్రం వారు చాలానే ఆశలు పెట్టుకుంటున్నట్లు వారి మాటల్ని వింటే అర్థమవుతోంది. మరి.. అల్ఫాబీట్ పేరు మీద నెలకొల్పే సంస్థ ద్వారా చేసే బిజినెస్ ఏమిటన్న విషయం మీద మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.