Begin typing your search above and press return to search.
బాలయ్యను బయటపడేసిన లాయరే బాబుపై కేసేశాడు
By: Tupaki Desk | 21 March 2016 8:57 AM GMTవైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు - స్పీకర్ కోడెల లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు - దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టుల్లో కీలక కేసులు వాదించిన సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ కళానిది ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే... చంద్రబాబుకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేసిన కళానిధి గతంలో చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన కేసు వాదించడం విశేషం. ఒకప్పుడు చంద్రబాబు కుటుంబీకులను ఇబ్బందుల నుంచి బయటపడేసిన ఆ న్యాయవాదే ఇప్పడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేయడం ఆసక్తి కలిగిస్తోంది.
చంద్రబాబు వియ్యంకుడు - హీరో బాలకృష్ణ కేసును గతంలో కళానిధే వాదించారు. గతంలో బెల్లంకొండ సురేశ్ - జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిలపై బాలయ్య కాల్పులు జరపడం.. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేసు బిగుసుకోవడం తెలిసిందే. ఆ కేసులో బాలయ్య తరఫున కోర్టులో వాదించింది కళానిధే. అప్పట్లో ఆ కేసు నుంచి బాలయ్య బయటపడడానికి కారణాలు ఎన్నున్నా కూడా కళానిది వాదనాపటిమ కూడా ఒక కారణమే. ఆ రకంగా చంద్రబాబు వియ్యంకుడి కేసును గెలిపించిన కళానిధి ఇప్పడు చంద్రబాబుపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.
కాగా కళానిధి పలు ఇతర ప్రముఖులకు చెందిన కీలక కేసులూ వాదించారు. హీరో మహేశ్ బాబు నటించిన సినిమా ఖలేజా టైటిల్ కు సంబంధించిన కేసునూ ఆయనే వాదించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమ్వే కేసునూ ఆయనే వాదించారు. ప్రస్తుతం రామంతపూర్ లో ఉండే ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా సింగరాయపాలెం.