Begin typing your search above and press return to search.

ఈసారి జగన్ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్

By:  Tupaki Desk   |   18 Jan 2016 7:43 AM GMT
ఈసారి జగన్ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్
X
ఏపీ అధికారపక్షం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని.. అవసరం లేకున్నా.. తమపై అక్రమంగా కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కడప జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై రచ్చ ఓపక్క సద్దుమణగక ముందే తాజాగా మరో అరెస్ట్ నమోదైంది. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసైన్డ్ భూముల్లో రోడ్లు వేస్తున్న అధికారులపై దాడి చేసిన ఉదంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాత్ర ఉంది. దీనిపై కేసు నమోదు కాగా.. తాజాగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణిగుంట విమానాశ్రయ మేనేజర్ రాజశేఖర్ పై భౌతిక దాడికి పాల్పడిన ఉదంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయటం.. ఈ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్న సమయంలోనే.. తాజాగా జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను మరో కేసులో అరెస్ట్ చేయటం ఆసక్తికరంగా మారింది. తాజా అరెస్ట్ పై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.