Begin typing your search above and press return to search.
గోరఖ్ పూర్ ట్రైలరేనట..సినిమా ముందుందట
By: Tupaki Desk | 21 March 2018 5:40 AM GMTఎనీ ప్లేస్.. ఎనీ సెంటర్.. బీజేపీ అంటూ మోడీని ముందు పెట్టి తొడకొట్టిన కమలనాథులకు ఇటీవల వెల్లడైన యూపీ ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. బీజేపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో అడ్డంగా ఓడిపోవటం చూస్తే.. బీజేపీపై యూపీలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందో తెలుస్తుందని చెబుతున్నారు. గోరఖ్ పూర్.. పుల్పూర్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మోడీ మీద నెగిటివ్ టాక్ అంతకంతకూ పెరుగుతోంది. పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ ఆయన్ను లక్ష్యపెట్టే వారు అస్సలు ఉండటం లేదన్న మాటకు బలం పెరుగుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా జేడీయూ సీనియర్ నేత..మాజీ ఎంపీ శరద్ యాదవ్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఒక మునిగిపోయే నావగా ఆయన అభివర్ణించారు. ఎన్డీయేలోని మిత్రపక్షాలన్నీ త్వరలోనే గుడ్ బై చెప్పేస్తాయన్న జోస్యాన్ని చెప్పారు.
గోరఖ్ పూర్.. ఫల‌్పూర్ ఉప ఎన్నికల ఫలితాలు మోడీ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను చూపించే చిన్నపాటి ట్రైలర్ మాత్రమేనని.. సార్వత్రిక ఎన్నికల్లో అసలు సినిమాను చూపిస్తారని చెబుతున్నారు. సమాజ్ వాదీ అధినేత అఖిలేశ్ తో భేటీ అయిన శరద్ యాదవ్ త్వరలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతితో మీటింగ్ పెట్టుకోనున్నట్లు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు మహా కూటమి ఏర్పాటుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. త్వరలో తాను దేశమంతా పర్యటిస్తానని చెబుతున్నారు. ఒక సీనియర్ నేత మోడీ సర్కారుపై చేసిన విమర్శ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.