Begin typing your search above and press return to search.
జేసీకి కౌంటర్.. పోలీస్ బూట్లను ముద్దాడిన గోరంట్ల
By: Tupaki Desk | 20 Dec 2019 6:31 AM GMTఅనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల చంద్రబాబు సమక్షంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..తమ ప్రభుత్వం వచ్చాక తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
మొన్నటి వరకూ పోలీస్ గా చేసి తాజాగా అనంతపురం ఎంపీగా గెలిచిన గోరంట్ల మాధవ్ తాజాగా జేసీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పోలీసు అమరవీరుల బూట్లను తుడిచి ఆ బూట్లను ముద్దాడాడు. శుక్రవారం అనంతపురంలోని హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు అమరవీరుల బూట్లను తుడిచి ముద్దాడాడు.
ఈ సందర్భంగా ఎంపీ మాధవ్ మాట్లాడుతూ జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ సమగ్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారని.. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వారిపై కామెంట్ చేస్తారా అని మండిపడ్డారు. పోలీసులపై జేసీ వ్యాఖ్యలు బాధాకరమన్నారు.
జేసీ కి పునర్జన్మ ఇచ్చింది పోలీసులేనని ఎంపీ మాధవ్ గుర్తు చేశారు. లేకపోతే అనంతపురంలో రక్షణ కల్పించకుంటే బతికి ఉండేవాడే కాదని అన్నారు. పోలీసు వ్యవస్థను కించపరచడం దారుణమన్నారు. జేసీ నోటి దురుసు వల్లే వాళ్లను ఓడించి తనను పార్లమెంట్ కు పంపారని గోరంట్ల స్పష్టం చేశారు.