Begin typing your search above and press return to search.
డర్టీ పిక్చర్ ఎపిసోడ్ తర్వాత జగన్‌ను కలిసిన ఆ ఎంపీ!
By: Tupaki Desk | 11 Nov 2022 4:26 AM GMTఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నగ్నంగా ఉండి ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడారంటూ మాధవ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారం ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీసింది. కొద్ది రోజులపాటు ఈ నగ్న వీడియో కాల్ వ్యవహారంపై రాష్ట్రం అట్టుడికింది.
తాను జిమ్‌లో ఉన్న వీడియోను మార్ఫింగ్ చేసి టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రచారం, ప్రసారం చేశాయని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేతలు, కొన్ని మీడియా చానెళ్లు, పత్రికల అధినేతలపై బూతుల దండకం ఎత్తుకున్నారు.
మరోవైపు టీడీపీ ఆ వీడియోను అమెరికాలోని ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్ష చేయించామని.. అది ఒరిజినల్ వీడియోనని ధ్రువీకరించిందని వెల్లడించింది. మరోవైపు ఆ వీడియోకు ఎలాంటి పరీక్షలు చేయించకుండానే అది నకిలీ వీడియో అంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప క్లీన్‌చిట్ ఇవ్వడం వివాదాస్పదమైంది.
కాగా ఈ డర్టీ పిక్చర్ వ్యవహారం నుంచి సైలెంట్‌గా ఉంటున్న గోరంట్ల మాధవ్ కొద్దిరోజుల క్రితం మరో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాను అనంతపురంలో అద్దెకు ఉంటున్న ఇంటికి మూడేళ్లుగా అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదని బాధితుడు ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గోరంట్ల మాధవ్ కులానికి చెందిన కురవ సామాజికవర్గానికి చెందినవారితో కలిసి ఆయన జగన్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జగన్‌కు కంబళి కప్పి సన్మానించారు. మదాసి కురువ, మదారి కురువలకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం ఇప్పటివరకు ఆర్డీవోలకు ఉంది. ఈ అధికారాన్ని తహసీల్దార్లకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు.
ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలపడానికి కురువ సంఘాల ప్రతినిధులతో గోరంట్ల మాధవ్ సీఎం జగన్‌ను కలిశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో ప్రయోజనకరమని కురువ సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.