Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియో.. వైసీపీని రోడ్డు మీద నగ్నంగా పెట్టేశాడట!

By:  Tupaki Desk   |   4 Aug 2022 5:18 AM GMT
వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియో.. వైసీపీని రోడ్డు మీద నగ్నంగా పెట్టేశాడట!
X
సాంకేతికతతో ఎన్ని సౌలభ్యాలు ఉన్నాయో.. అంతకు మించిన సమస్యలు వచ్చి పడుతుంటాయి. అందులోని అత్యున్నత స్థానంలో ఉన్న వారు మరింత జాగ్రత్తగా.. కేర్ ఫుల్ గా ఉండాలి. ఈ విషయంలో చిన్నపాటి తేడా దొర్లినా జరిగే నష్టం అంతా ఇంతా కాదు.

ఇప్పుడు అలాంటి సమస్యలోనే ఇరుక్కుపోయారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్నారు అంటూ వీడియో ఒకటి ప్రధాన మీడియా లో వైరల్ గా మారింది. మార్ఫింగ్ చేశారన్న మాట చెప్పటానికి వీల్లేని విధంగా ఉంది అంటూ ప్రధాన మీడియా లో వార్తలు వస్తున్నాయి .. అక్షరాల్లో రాయలేని రీతిలో ఉన్న ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది అని అంటున్నారు.

దీంతో.. గోరంట్ల మాధవ్ కు చెందిన నగ్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు తిరుగులేని ఆయుధంగా మారిందన్న మాట వినిపిస్తోంది. సదరు వీడియోను ఉత్సాహంతో కొందరు కొన్ని గ్రూపుల్లో పోస్టు చేసినా.. దాన్ని చూసినోళ్లు.. సొంతంగా డిలీట్ చేస్తున్నారు.

మరికొందరు.. ఇలాంటివి గ్రూపుల్లో వద్దనే వద్దన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సీఐగా పని చేస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకి రావటమే కాదు.. 2019లో టీడీపీకి కోటగా ఉండే హిందూపురం ఎంపీ స్థానం నుంచి వైసీపీ ఎంపీగా విజయాన్ని సాధించిన ఆయన.. ఇలాంటి అంశంలో ఇరుక్కుపోవటం చూస్తే.. ఆయనకు తగిన ‘శిక్ష’ తప్పదన్న మాట వినిపిస్తోంది.

రాజకీయ ప్రత్యర్థులపై దూకుడుగా వ్యవహరిస్తారన్న పేరున్న ఆయన.. తాజాగా బయటకు వచ్చిన వీడియోను చూస్తే.. అంత అడ్డంగా ఎలా బుక్ అయ్యారన్నది ప్రశ్నగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో.. సదరు వీడియోను చూసినోళ్లు ఎవరైనా సరే.. ఆయన్ను సమర్థించే సాహసం చేయరంటున్నారు. ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే.. పార్టీని నడి బజార్లో నగ్నంగా నిలుచోబెట్టటం తప్పించి మరొకటి ఉండదంటున్నారు. హనీట్రాప్ కానీ.. మరేదైనా కానీ ఆయన అయితే నగ్నంగా నిలబడి.. ప్రత్యర్థులకు అవకాశాన్ని ఇచ్చారు. ఆయన నగ్నత్వం ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వైసీపీ ఎంపీ మాధవ్ వీడియోకు ఆయన ‘తగిన మూల్యం’ చెల్లించాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

ఇది ఇలా ఉంటె గోరంట్ల మాధవ్ ఈ వీడియో మీద ప్రెస్ మీట్ పెట్టి అది ఫేక్ వీడియో అంటూ కొట్టి పారేశారు.