Begin typing your search above and press return to search.
మెజార్టీ ఉంది.. నామినేషన్ వేసిన గౌరు
By: Tupaki Desk | 27 Feb 2017 10:12 AM GMTఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం షురూ కావటం తెలిసిందే. స్థానిక సంస్థల స్థానానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఫలితాల్లో జగన్ పార్టీకి స్పస్టమైన మెజార్టీ ఉంది.
వాస్తవానికి.. ఇంత స్పష్టమైన మెజార్టీ ఉన్న వేళ.. వేరే పార్టీలు పోటీకివచ్చేందుకు ఇష్టపడవు. మెజార్టీ ఉన్న నేపథ్యంలో అనవసరమైన పోటీకి తెర తీసి ఓడిపోయే కంటే.. బరిలోకి దిగకుండా ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు కాస్త భిన్నంగా ఉండటం.. బలం లేని చోట కూడా.. ఏదో రీతిలో ప్రయత్నాలు చేయాలన్న తత్త్వం ఉండటం.. గతంలో ఇదే తీరులో ఓటుకు నోటు కేసులో ఆ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్ కావటం తెలిసిందే.
టీడీపీకి అలవాటైన మైండ్ సెట్ తో ఎన్నికల బరిలోకి దిగుతారా? లేక.. బలం లేదన్న విషయాన్ని గుర్తించి వెనక్కి తగ్గుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ ఉన్న రాజకీయ పరిస్థితుల్నిచూస్తున్నప్పుడు.. అధికార తెలుగుదేశం తరఫున పోటీకి దిగే దిశగా ప్రయత్నాలు జరగలేదని చెబుతున్నారు. మరోవైపు.. బలం లేని చోట్ల కూడా తమకున్న ‘పవర్’తో గెలుపుబాట పట్టాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా కొందరు తమ్ముళ్లు తమ ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. బలం లేని విషయాన్ని గుర్తించి వెనక్కి తగ్గుతారా? లేక.. తమదైన తొండి ఆటను బాబు అండ్ కో ఆడతారా? అన్నది కాలమే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/