Begin typing your search above and press return to search.

మగాళ్ల కు స్వీట్ న్యూస్ చెప్పనున్న కేంద్రం..

By:  Tupaki Desk   |   3 Jan 2020 5:39 AM GMT
మగాళ్ల కు స్వీట్ న్యూస్ చెప్పనున్న కేంద్రం..
X
విదేశాల్లో ఉండే కొన్ని వసతులు మన దేశంలో అమలు కావు. పిల్లలు పుట్టే సందర్భంలో తల్లులకు ఆఫీసులు సెలవులు ఇస్తాయి కానీ.. తండ్రులకు నో అని చెప్పేస్తాయి. అప్పుడే పుట్టిన బుజ్జాయితో గడపాలని తండ్రి అనుకున్నా.. అందుకు సాధ్యంకాని పరిస్థితి. ప్రాశ్చాత్య దేశాల్లో మాత్రం అలాంటి సౌలభ్యం ఉంది. తాజాగా కేంద్రం ఈ అంశం మీద కొత్త నిర్ణయాన్ని తీసుకునేలా ఆలోచనలుచేస్తోంది.

ఇప్పటివరకూ అమ్మలకు మాత్రమే ఇచ్చే సెలవుల్ని.. నాన్నలకుకూడా వర్తింపచేయాలన్న ఆలోచనలో మోడీ సర్కార్ ఉంది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖతో సమాచాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ చర్చలు తుదిదశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకన్నట్లు జరిగితే.. ఇప్పటివరకూ లేని రీతిలో తండ్రులయ్యే పురుషులకు కూడా సెలవులు అందుబాటులోకి రానున్నాయి.

దీనికి సంబంధించిన బిల్లును త్వర లో పార్లమెంటులో ప్రవేశ పెట్టాలన్న ఆలోచన లో కేంద్రం ఉంది. ఇప్పటి వరకూ మాతృత్వ సెలవుల్ని మాత్రమే ఇస్తున్న స్థానే.. రానున్న రోజుల్లో పితృత్వ సెలవులు కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పాటు షరతుల తో కూడిన పితృత్వ సెలవులు ఇవ్వాలన్న రూల్ ను ఫాలో అవుతున్నారు. దీని స్థానే.. ప్రతి తండ్రికి తమకు పిల్లలు పుట్టినప్పుడు పితృత్వ సెలవుల్ని తప్పనిసరి చేసేలా కేంద్రం ఒక చట్టాన్ని చేయాలని భావిస్తోంది. అదే జరిగితే.. దేశంలోని మగవాళ్లంతా మోడీ సర్కారుకు రుణపడిపోతారనటంలో సందేహం లేదు.