Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం మొత్తం మారిపోనున్న విశాఖ‌ పాల‌క‌మండ‌లి రూపు?

By:  Tupaki Desk   |   16 March 2021 12:30 AM GMT
జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం మొత్తం మారిపోనున్న విశాఖ‌ పాల‌క‌మండ‌లి రూపు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. అభివృద్ధి ప్ర‌ధానంగా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారో ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తోంది. రాష్ట్రంలో డెవ‌ల‌ప్ మెంట్ ను కేవ‌లం ఒకే న‌గ‌రానికి ప‌రిమితం చేయొద్ద‌న్న ఆలోచ‌న‌తో.. రాజ‌ధాని విభ‌జ‌న‌కు శ్రీకారం చుట్టారు సీఎం. మొద‌ట్లో వ్య‌తిరేకించిన వారు కూడా.. ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తి ప్రాంతంలోనూ వైసీపీ విజ‌యం సాధించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

ఇక‌, జ‌గ‌న్ తీసుకున్న మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం రాష్ట్రానికి ఐదుగురు ఉప ముఖ్య‌మంత్రుల‌ను నియ‌మించ‌డం. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన వారిని నియ‌మించ‌డం ద్వారా.. అన్ని ప్రాంతాలూ స‌మ‌గ్రాభివృద్ధి చెందుతాయ‌న్న లక్షించారు జ‌గ‌న్. ఆశించిన‌ట్టుగానే రాష్ట్రంలో అభి‌వృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలా రాష్ట్రం మొత్తం స‌మంగా విస్త‌రిస్తోంది.

ఇప్పుడు.. గ్రేట‌ర్ విశాఖ పాల‌క మండ‌లిలోనూ మ‌రో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నార‌నే వార్త సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానిగా ఉన్న విశాఖ స‌ర్వ‌తోముఖాభివృద్ధి చెందాల‌నే ఉద్దేశంతో జీవీఎంసీ కౌన్సిల్ కూర్పు స‌రికొత్త‌గా ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. రాష్ట్ర పాల‌క మండ‌లి విధానాన్ని జీవీఎంసీలోనూ ఇంప్లిమెంట్ చేయ‌బోతున్నార‌ట జ‌గ‌న్‌. రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్న‌ట్టుగానే.. విశాఖ‌లో ఎక్కువ సంఖ్య‌లో డిప్యూటీ మేయ‌ర్ల‌ను నియ‌మించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

గ్రేట‌ర్ విశాఖ‌లోని ఆరు ప్రాంతాలకు ప్రాతినిథ్యం వ‌హించే ఆరుగురు కార్పొరేట‌ర్ల‌ను ఎంచుకొని, వారంద‌రినీ డిప్యూటీ మేయ‌ర్లుగా నియ‌మించున్న‌ట్టు తెలుస్తోంది. త‌ద్వారా.. అన్ని ప్రాంతాల‌ను స‌మ‌గ్రంగా అభివృద్ది చెందేలా ప్ర‌ణాళిక ర‌చిస్తున్నార‌ని స‌మాచారం.

వీరిని ఆయా సామాజిక వ‌ర్గాల ప్రాతిప‌దిక‌న మాత్ర‌మే కాకుండా.. అభివృద్ధి కోణంలో ఎంపిక చేయనున్నార‌ట‌. ఈ ఆరుగురు డిప్యూటీ మేయ‌ర్ల‌లో విద్యావంతులు, మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నార‌ట‌. ఈ విధానం అమ‌ల్లోకి వ‌స్తే మాత్రం.. విశాఖ న‌మూనా దేశంలోనే ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకోవ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.