Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుల పేర్లు చెప్ప‌గ‌ల‌రా?

By:  Tupaki Desk   |   26 July 2021 9:52 AM GMT
ఏపీ ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుల పేర్లు చెప్ప‌గ‌ల‌రా?
X
ఇప్పుడు ఇదొక ఆసక్తి క‌ర చ‌ర్చ‌. ఏపీలోని జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంలో ఎంత‌మంది స‌ల‌హాదారులు ఉన్నారు? ఏం చేస్తున్నారు? .. ఇవ‌న్నీ రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. రాష్ట్ర హైకోర్టు ఇటీవ‌ల.. మాజీ సీఎస్‌.. నీలం సాహ్నిని ఎస్ ఈసీగా నియ‌మించడాన్ని స‌వాల్ చేస్తూ.. దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా.. కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ``రాష్ట్రంలో ఇంతమంది స‌ల‌హాదారులా?`` అంటూ.. హైకోర్టు ధ‌ర్మాస‌న‌మే.. అచ్చెరు వొందింది.

దీనిపై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరూప్ గోస్వామి కూడా విస్మ‌యం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. హైకోర్టు న్యాయ‌మూర్తుల‌కు కూడా లేని స‌క‌ల స‌దుపాయాలు.. ఈ స‌ల‌హాదారుల‌కు అందుతు న్నాయ‌ని.. కోర్టు పేర్కొన‌డం.. చ‌ర్చ‌కు దారితీసింది. ఈ క్ర‌మంలో అస‌లు ఎంత మంది స‌ల‌హాదారులు ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు? అనే అంశాల‌పై నెటిజ‌న్లు కూడా సెర్చ్ చేస్తున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే.. అప్ప‌టి వ‌ర‌కు పార్టీ ప‌రంగా, మీడియా ప‌రంగా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో స‌హ‌క‌రించార‌నే వారికి స‌ల‌హాదారు పోస్టులు ఇచ్చారు.

వీటిలో ఆయా పోస్టుల ప్రాధాన్యం ప్ర‌కారం కాకుండా.. అంద‌రికీ ఒకే రీతిగా గౌర‌వ వేత‌నం(2ల‌క్ష‌లు) నిర్ణ‌యించారు. ఇక‌, దీనికి అద‌నంగా అల‌వెన్సులు క‌లిపితే.. మ‌రో ల‌క్ష న్న‌ర వ‌ర‌కు ముట్ట‌చెబుతున్నారు. అదేస‌మ‌యంలో కారు, అసిస్టెంట్ వంటివి మామూలే. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క ప్ర‌కారం.. రాజ‌కీయ స‌ల‌హాదారు, ఐటీ స‌ల‌హాదారు, అడ్మినిస్ట్రేటివ్ స‌ల‌హాదారు, న్యాయ స‌ల‌హాదారు.. ఇవ‌న్నీ.. కామ‌న్‌. అయితే.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చాక‌.. దీనికి ఒక స‌ల‌హాదారును నియ‌మించారు.

జాతీయ మీడియాను మేనేజ్ చేసేందుకు అక్క‌డ ఢిల్లీలో ఇద్ద‌రి నుంచి ముగ్గురిని నియ‌మించారు. ఇలా.. మంత్రుల సంఖ్యకు రెండు రెట్లు స‌ల‌హాదారులు ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ ఇంకో చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. ఏపీ స‌ర్కారుకు స‌ల‌హాదారులుగా నియ‌మితులైన వారిలో పొరుగు రాష్ట్రం తెలంగాణ కు చెందిన వారు కూడా ఉన్నారు. పోనీ.. ఇంత మందిని నియ‌మించుకున్నా.. వీరు ఏం స‌ల‌హాలు ఇస్తున్నారు? అనేది మ‌రో మౌలిక ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌డం లేదు.

ఇదే విష‌యంపై ఇటీవ‌ల న్యాయ వ్య‌వ‌స్థ కూడా ప్ర‌భుత్వానికి స‌ల‌హాదారులు.. స‌రైన స‌ల‌హాలు ఇవ్వ‌డం లేద‌ని పిస్తోంది.. అని కామెంట్ చేసింది. ప్ర‌జ‌లు క‌డతున్న ప‌న్నుల‌తో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు వేత‌నాలు పొం దుతున్న ఈ స‌ల‌హాదారులు ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి చేస్తున్న మేలేదైనా ఉందా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌డం లేదు. అయితే.. ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని.. తాము టార్గెట్ అవుతామ‌ని గుర్తించారో.. ఏమో.. ఒక విభాగానికి స‌ల‌హాదారుగా ఉన్న‌.. ప్ర‌ముఖ విశ్రాంత పాత్రికేయులు.. ఒక‌రు ఏడాది కింద‌టే త‌న స‌ల‌హాదారు ప‌ద‌విని స్వ‌చ్ఛందంగా వ‌దులుకోవ‌డం గ‌మ‌నార్హం. మిగిలిన వారు మాత్రం ప‌నున్నా..లేకున్నా.. ప‌ట్టుకుని వేలాడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.