Begin typing your search above and press return to search.
వాణిజ్యశాఖలో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు!
By: Tupaki Desk | 16 Aug 2016 3:54 AM GMTఉద్యోగం ఆఫీసుకు వెళ్లి చేయాలి అనేది పాత మాట. వర్క్ ఫ్రం హోం అనేది కొత్తమాట. సాదారణంగా ఆఫీసుకు వెళ్లనవసరం లేకుండా.. ఇంటినుంచే ఉద్యోగం చేసే అవకాశం ప్రైవేటు ఉద్యోగులకు - అందులోనూ ఐటీ ఉద్యోగులకు ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో సుమారు ఏభై శాతం మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారట! అయితే ఈ అవకాశం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వచ్చేసింది. ఈ మేరకు కేంద్రం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయొచ్చు.
ఐటీ - ఐటీఈఎస్ సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండళ్లు) యూనిట్ల ఉద్యోగులు ఇకపై ఇంటివద్ద ఉండి కూడా పనిచేయొచ్చనే నిర్ణయాన్ని కేంద్రం తాజాగా తీసుకుంది. ఈ మేరకు ఇంటి వద్ద నుంచైనా - మరే ఇతర ప్రదేశం నుంచైనా వీరు తమ ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే... ఐటీ - ఐటీఈఎస్ సెజ్ యూనిట్లలోని ఉద్యోగులు.. ఇంటి నుంచి - సెజ్ వెలుపలి ప్రాంతం నుంచైనా వారి ఉద్యోగ కార్యకలాపాలను నిర్వహించవచ్చా? లేదా? అనే అంశంపై స్పష్టతనివ్వాలని పరిశ్రమ సంబంధిత ప్రతినిధులు - ఇన్వెస్టర్లు మంత్రిత్వ శాఖను కోరాయని.. ఈ నేపథ్యంలోనే మంత్రిత్వ శాఖ పలు నిబంధనలతో సెజ్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయొచ్చని తెలిపిందని తెలుస్తోంది.
అయితే ఇలా ఇంటి నుంచి లేదా సెజ్ వెలుపల నుంచి ఉద్యొగం చేసుకునేవారికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది ఈ మంత్రిత్వ శాఖ. ఈ కండిషన్స్ ప్రకారం సెజ్ వెలుపల నుంచి బాధ్యతలు నిర్వర్తించాలనునే వ్యక్తి కచ్చితంగా రెగ్యులర్ ఎంప్లాయి అయ్యిండాలి. ఇదే సమయంలో బయట నిర్వర్తించే బాధ్యతలు సెజ్ యూనిట్ సర్వీసులకు లోబడినవై ఉండాలి. ఆ బాధ్యతలు ఎట్టిపరిస్థితుల్లోనూ సెజ్ ప్రాజెక్టులకు సంబంధించినవై ఉండాలి.. ఇలాంటి కొన్ని నిబంధనలు మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. దీంతో ఈ అవకాశంకోసం ఎదురుచూస్తున్న, అసలు ఇలాంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుందా అని బాదపడినవారు.. ఈ తాజా నిర్ణయంతో ఎగిరిగంతేస్తున్నారట!