Begin typing your search above and press return to search.

కేంద్రం సంచ‌ల‌నం - ఏజెన్సీల‌కు ఫుల్ ప‌వ‌ర్స్!

By:  Tupaki Desk   |   21 Dec 2018 9:21 AM GMT
కేంద్రం సంచ‌ల‌నం - ఏజెన్సీల‌కు ఫుల్ ప‌వ‌ర్స్!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మ‌న‌దేశంలోని ఏ కంప్యూట‌ర్ లోకి అయినా తొంగిచూసే అధికారాన్ని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెట్టింది. వాటిలోని స‌మాచారాన్ని నియంత్రించే ఫుల్‌ ప‌వ‌ర్స్ నూ ఇచ్చేసింది. దీంతో సీబీఐ - నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ స‌హా మొత్తం ప‌ది ద‌ర్యాప్తు సంస్థ‌లు శ‌క్తిమంతం కానున్నాయి.

మ‌న‌దేశంలో ప్ర‌స్తుతం వ్యాప్తిలో ఉన్న డేటాను నియంత్రించే అధికారం మాత్ర‌మే ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఉంది. కొన్ని కీల‌క కేసుల ద‌ర్యాప్తులో - సంఘ విద్రోహ శ‌క్తుల కుట్ర‌ల‌ను ముందే ప‌సిగ‌ట్టి భ‌గ్నం చేయ‌డంలో ఈ అధికారాలు ఏమాత్రం స‌రిపోవ‌డం లేద‌ని కేంద్రం భావించింది. అందుకే కంప్యూట‌ర్ల డేటా నియంత్ర‌ణ‌లో ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారాల‌ను విస్తృతం చేస్తూ రూపొందించిన ఉత్త‌ర్వుల‌పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా గురువారం సంతకం చేశారు.

కేంద్ర హోంశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. సీబీఐ - ఇంటెలిజెన్స్‌ బ్యూరో - నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో - ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) - సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌(సీబీడీటీ) - డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ - ఎన్ ఐఏ- రీసెర్చ్ అండ్ అనాల‌సిస్ వింగ్ (రా) కేబినెట్‌ సెక్రటేరియట్‌ - డైరెక్టరేట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌(జమ్ముకశ్మీర్‌ - ఈశాన్య రాష్ట్రాలు - అసోం) - దిల్లీ పోలీసు కమిషనర్‌ లకు ప్ర‌త్యేక అధికారాలు ల‌భిస్తాయి. వీరు మ‌న‌దేశంలో సాధార‌ణ‌ ప్రజలతో పాటు అన్ని సంస్థలు ఉపయోగించే కంప్యూటర్లలోని సమాచారాన్నైనా చూడ‌వ‌చ్చు. వాటిలోని డేటాను నియంత్రించొచ్చు. కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన - అప్ప‌టికే పంపించిన - స్వీక‌రించిన - జనరేట్‌ చేసిన సమాచారాన్ని అడ్డుకునే అధికారాలు కూడా వారికి ఉంటాయి. త్వ‌ర‌లోనే సెల్ ఫోన్ల లోని స‌మాచారాని నియంత్రించే అధికారాల‌ను కూడా నియంత్రించే అధికారాన్ని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెట్టాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.